బీజేపీ పార్టీ కి గుడ్ బై చెప్పనున్న కీలక నేత  

Bjp Senior Leader Ready To Join Into Congress Party-cm Yadyurappa,congress Seniour Leader D.k. Siva Kumar,sri Mantha Patil

బీజేపీ కీలక నేత రాజు కాగే ఆ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు.దానికి ముహూర్తం కూడా కుదుర్చుకున్నట్లు తెలుస్తుంది.అయితే ఆయన రాజీనామా కు అసలు కారణం అసంతృప్తి అన్నట్లుగా తెలుస్తుంది.2018 శాసనసభ ఎన్నికలలో రాజుకాగె బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే.ఇదే స్థానం నుంచి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా గెలుపొందిన శ్రీమంతపాటిల్‌ రాజీనామా చేయగా ప్రస్తుతం అనర్హుడిగా ఉన్నారు.

Bjp Senior Leader Ready To Join Into Congress Party-cm Yadyurappa,congress Seniour Leader D.k. Siva Kumar,sri Mantha Patil Telugu Political Breaking News - Andhra Pradesh,Telangana Partys Coverage-BJP Senior Leader Ready To Join Into Congress Party-Cm Yadyurappa Congress Seniour D.k. Siva Kumar Sri Mantha Patil

బీజేపీ టికెట్‌ పాటిల్‌కే ఇవ్వాలని అధిష్ఠానం నిర్ణయించుకున్నమేరకు రాజుకాగే ఏకంగా పార్టీ కి గుడ్‌బై చెబుతున్నారు.పార్టీ నిర్ణయమైనందున శ్రీమంతపాటిల్‌ను గెలిపించుకుని వస్తే ఏదైనా కార్పొరేషన్‌కు ఛైర్మన్‌ చేస్తామని రాజుకాగెకు సీఎం యడియూరప్ప భరోసా ఇవ్వడం తో ఏడాదిన్నర కిందట ప్రత్యర్థిగా బరిలోకి దిగి ఇప్పుడు ఆయనకే మద్దతు తెలుపుతూ ప్రజల్లోకి వెళ్ళడానికి ఇష్టం లేకనే ఆయన ఏకంగా పార్టీని వీడేందుకు సిద్దమైనట్లు తెలుస్తుంది.ఆదివారం కాంగ్రెస్‌ సీనియర్‌ నేత డీకే శివకుమార్‌ను కలిసిన రాజు కాగే తాజాగా ప్రతిపక్షనేత సిద్దరామయ్య, పార్టీ అధ్యక్షుడు దినేశ్‌ గుండూరావ్‌లను కలిసి చర్చించారు.

దీనితో ఆయన నేడు బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి బుధవారం కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తుంది.దీంతో బీజేపీకి చెందిన సీనియర్‌నేత పార్టీని వీడుతున్నట్లు తెలుస్తుంది.

మొన్నటివరకు కర్ణాటకలో రాజకీయ సంక్షోభం నెలకొనడం తో అధికారంలో ఉన్న కూటమి పార్టీ దిగి బీజేపీ పార్టీ అధికారాన్ని చేపట్టిన విషయం విదితమే.అయితే ఇప్పుడు బీజేపీ పార్టీ లో కూడా బీటలు మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.