పురందేశ్వరికి కరోనా పాజిటివ్‌ వార్తలు నిజమేనా?  

BJP senior leader Daggubati Purandeswari tests positive for corona, Daggubati Purandeswari, Coronavirus, Venkaiah Naidu, Home Isolation, BJP, Central Ministers, Hyderbad Hospitals - Telugu Ap Bjp Leader, Bjp Leader, Corona, Covid-19, Daggubati Purandeswari, Venkaiah Naidu

జాతీయ నాయకులకు వరుసగా కరోనా పాజిటివ్‌ అంటూ నిర్థారణ అవ్వడం ఆందోళన కలిగిస్తుంది. కొన్ని గంటల క్రితమే ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు కరోనా పాజిటివ్‌ అంటూ నిర్థారణ అయ్యింది.

TeluguStop.com - Bjp Senior Leader Daggubati Purandeswari Tests Positive For Corona

ఆయనకు ఎలాంటి లక్షణాలు లేవు కనుక హోం ఐసోలేషన్‌ లో ఉన్నారు అంటూ అధికారికంగా ప్రకటన వచ్చింది.అయితే దగ్గుబాటి పురందేశ్వరి కరోనా పాజిటివ్‌ విషయంలో గందరగోళం నెలకొంది.

ఆమె హైదరాబాద్‌ లోని ఒక ఆసుపత్రిలో జాయిన్‌ అవ్వడంతో అంతా కూడా ఆమెకు కరోనా పాజిటివ్‌ అంటూ ప్రచారం చేస్తున్నారు.అయితే ఇప్పటి వరకు ఆమె కాని ఆమె సన్నిహితులు కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఆమెకు కరోనా నిర్థారణ అయ్యిందని వెళ్లడించలేదు.

TeluguStop.com - పురందేశ్వరికి కరోనా పాజిటివ్‌ వార్తలు నిజమేనా-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

కరోనా లక్షణాలతో ఆమె ఆసుపత్రిలో జాయిన్‌ అయిన విషయం వాస్తవం.కాని అది కరోనా అవునా కాదా అనే విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.వైద్యులు ఆమెకు కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు.ఈ సాయంత్రం వరకు ఆమె ఆరోగ్యం విషయంలో పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉందని కుటుంబ సన్నిహితులు అంటున్నారు.

ఆమె ఆరోగ్యం విషయంలో జాతీయ మీడియా భిన్నంగా స్పందించింది.కొందరు కరోనా నిర్థారణ అయ్యిందని కథనాన్ని రాయగా మరి కొందరు కరోనా లక్షణాలతో ఆసుపత్రిలో జాయిన్‌ అయినట్లుగా వార్తలు రాశారు.

అసలు విషయం ఏంటీ అనేది మరికాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.వెంకయ్య నాయుడుకు కరోనా వచ్చిన విషయాన్ని ప్రస్థావించి ఆయన త్వరగా కోలుకోవాలంటూ పురందేశ్వరి కొద్ది సేపటి క్రితం ట్వీట్‌ పెట్టారు.

కాని తన ఆరోగ్యం విషయంలో మాత్రం ఆమె స్పష్టత ఇవ్వలేదు.

#COVID-19 #Corona #AP BJP Leader #BJP Leader #Venkaiah Naidu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Bjp Senior Leader Daggubati Purandeswari Tests Positive For Corona Related Telugu News,Photos/Pics,Images..