జీవో 317 పై ఆగని రగడ... తగ్గేదే లే అంటున్న బీజేపీ

తెలంగాణ ఉద్యోగుల బదిలీల విషయంలో విడుదల చేసిన జీవో 317 పై రగడ అనేది కొనసాగుతూనే ఉంది.ఇప్పటికే చాలా మంది ఉద్యోగులు తాము ఎంచుకున్న స్థానాల్లో బదిలీలపై ఈ రగడ అనేది ప్రారంభమైన విషయం తెలిసిందే.

 Bjp Says Non-stop Rage On Jivo 317 Will Decrease Telangana Politics, Bjp, Ts Po-TeluguStop.com

అయితే ఆ తరువాత బీజేపీ ఈ అంశంలో జోక్యం చేసుకోవడంతో ఇక మరింతగా రాజకీయ మలుపు తిరిగిందని చెప్పవచ్చు.అయితే జీవో 317 కు వ్యతిరేకంగా బండి సంజయ్ దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే.

ఆ తరువాత అరెస్ట్ చేయటం లాంటి ఘటనలు మనం చూసాం.అయితే అయితే గత కొద్ది రోజులుగా విషయం సద్దుమణిగింది అనుకున్న తరువాత మరల వేములవాడ పర్యటనలో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలతో మరల ఈ అంశం రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది.

అయితే ఇంకా వరంగల్ లాంటి పట్టణాలలో ఇంకా కొద్ది మంది ఉపాధ్యాయులు ధర్నాలు, నిరసనలు చేస్తున్నా మెజారిటీ ఉద్యోగులు విధుల్లో చేరడంతో ప్రభుత్వం ఇక ఆ అంశాన్ని తేలికగా  తీసుకున్న పరిస్థితి ఉంది.అయితే ఈ నిరసనలు జరుగుతూ ఉన్న సమయంలోనే ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ చెల్లింపుతో ఒక్కసారిగా ఉద్యోగులు ఆగ్రహం చల్లబడింది అని చెప్పవచ్చు.

అయినా బీజేపీ ఈ అంశాన్ని ఇంకా వదిలే పరిస్థితి కనిపించడం లేదు.

ఎందుకంటే ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ లు విడుదల చేసే వరకు ఇక వేరే అంశం ఏది కూడా ప్రతిపక్షాలకు లేని పరిస్థితుల్లో ఇదే అంశాన్ని కొనసాగించే అవకాశం ఉంది.అయితే ఇక ఈ అంశంపై ఎంతగా పోరాటం చేసినా కనీసం స్పందించిన పరిస్థితి లేదు.అయితే బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన జీవో 317 సవరణ అంతా రాజకీయ ప్రయోజనం కోసమేనని కెసీఆర్ బలంగా విశ్వసించారని  రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube