తెలంగాణ బీజేపీ రోజురోజుకు పెద్ద ఎత్తున బలపడేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే.ఇంకా ఎన్నికలకు రెండున్నర సంవత్సరాలు ఉన్నా ఇప్పటి నుండే పెద్ద ఎత్తున ఎన్నికల హడావిడి రాష్ట్ర రాజకీయాల్లో నెలకొంది.
ఇప్పటికే వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రావాలనే ఉద్దేశ్యంతో ఉన్న బీజేపీ ఇప్పటికే ఇతర పార్టీలలో ఉన్న కీలక నేతలపై ఒక్కసారిగా దృష్టి పెట్టిన పరిస్థితి ఉంది.అయితే ప్రస్తుతం తెలంగాణలో ఉన్న అన్ని పార్టీలు కెసీఆర్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తూ ఎంతో కొంత గత ఎన్నికల కంటే మెరుగైన ఫలితాలు సాధించాలనే ఏకైక లక్ష్యంతో ముందుకు సాగుతున్న పరిస్థితి ఉంది.
అయితే ఇక కెసీఆర్ పై రోజుకో రకంగా ఏదో ఒక విషయాన్ని బయటికి తీసి ఇక దానిపై ధర్నాలు, నిరసనలు చేస్తూ తగ్గేదెలే అన్న రీతిలో బీజేపీ వ్యవహరిస్తోంది.అయితే ఇతర రాష్ట్రాలలో బీజేపీ ఘన విజయం సాధించడంతో ఇక తెలంగాణపై బీజేపీ అధిష్టానం ఫోకస్ పెట్టిందని చెప్పవచ్చు.
అయితే ఇతర రాష్ట్రాలలో ప్రయోగించిన వ్యూహం తెలంగాణలో ఎంత మేరకు ఫలిస్తాయనేది కొంత ప్రశ్నార్థకమైన విషయమైనప్పటికీ రానున్న రోజుల్లో బీజేపీ వ్యూహాలు ఏ మేరకు ప్రజల్లో విజయవంతమవుతాయనేది రానున్న రోజుల్లో మనకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

అయితే బీజేపీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో అధికారంలోకి రాబోతున్నామని బీజేపీకి ఓటు వేయడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారని పెద్ద ఎత్తున ఇటు సోషల్ మీడియాలో, బహిరంగ సభల్లో కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న పరిస్థితి ఉంది.అయితే కెసీఆర్ మాత్రం రాష్ట్రంలో జరుగుతున్న ప్రతిపక్షాల రాజకీయ విధానంపై స్పందించకున్నా సరైన సమయంలో స్పందించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.







