కెసీఆర్ జిల్లాల పర్యటనపై బీజేపీ సెటైర్ లు...ఇక సమరమేనా?

తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు అధికార ప్రతిపక్షాల దూకుడుతో విమర్శలు ప్రతి విమర్శలతో పెద్ద ఎత్తున ఆసక్తికరంగా హాట్ హాట్ గా మారిన సంగతి తెలిసిందే.అయితే ఇక వచ్చే రెండున్నర సంవత్సరాలలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న తరుణంలో ఇక ప్రజల్లోకి వెళ్లాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

 Bjp Satires On Kcr District Tour Is It A Struggle Anymore, Ktr, Trs Party-TeluguStop.com

కావున ఇక త్వరలో జిల్లాల పర్యటనలకు ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టనున్నట్లు వార్తలు పెద్ద ఎత్తున వెలువడుతున్న నేపథ్యంలో కేసీఆర్ జిల్లాల పర్యటనల పట్ల బీజేపీ సెటైర్ లు వేస్తున్న పరిస్థితి ఉంది.ఇక ఫామ్ హౌజ్ నుండి ఇప్పటికైనా బయటకు వచ్చినందుకు ప్రజలు సంతోషిస్తున్నారని ఇది బీజేపీ వల్లే సాధ్యమైనందని బీజేపీ నాయకులు ఇది తమ ఘనతగా చెప్పుకుంటున్న పరిస్థితి ఉంది.

ఇక రెండున్నర సంవత్సరాలలోనే  ఎన్నికలు ఉన్నందున మరో నాటకానికి కేసీఆర్ తెరదీశాడని కానీ కేసీఆర్ ను నమ్మేందుకు ప్రజలు సిద్దంగా లేరని ఇక టీఆర్ఎస్ ప్రభుత్వానికి చరమ గీతం పాడేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని బీజేపీ ఆధికార ప్రతినిధి రాకేశ్ రెడ్డి మండిపడ్డారు.

అయితే బీజేపీ వ్యాఖ్యల పట్ల టీఆర్ఎస్ నుండి అంతగా స్పందన రాకపోవడమే కాకుండా చాలా వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటూ చాలా వేగంగా ముందుకు సాగుతున్నారు.

ఇక కేసీఆర్ పర్యటించబోయే జిల్లాలో ప్రజల చిరకాల కోరిక ఏదైతే ఉందో సదరు కార్యక్రమానికి కేసీఆర్ శంకుస్థాపన చేయడం ద్వారా జిల్లాలో టీఆర్ఎస్ పార్టీని ఏ అంశంపై విమర్శలు గుప్పిస్తున్నారో అదే సమస్యను ప్రభుత్వం పరిష్కరించనున్న నేపథ్యంలో ఇక టీఆర్ఎస్ పార్టీ అనుకూల పరిస్థితులను  పెంచుకోవడానికి ఈ జిల్లాల పర్యటన చాలా చక్కగా ఉపయోగపడుతుంది.అంతేకాక కేసీఆర్ ఆ జిల్లాల పర్యటన సందర్భంగా  చాలా రకాల వరాల జల్లులు కురిపించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయ పడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube