బ్రాహ్మణ అట్రాసిటీ చట్టం కావాలంటున్న సాధినేని యామిని  

Sadineni Yamini Demand Brahmin Atrocities Act - Telugu Bjp, Brahmin Atrocities Act, Governor, Sadineni Yamini, Tdp

ఎన్నికలకి ముందు తెలుగు దేశం పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న సాధినేని యామిని గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు.పవన్ కళ్యాణ్ ఇష్యూలో ఒక్కసారిగా సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన సాధినేని యామినికి తెలుగు దేశం పార్టీలో మంచి ప్రాధాన్యత లభించింది.

Sadineni Yamini Demand Brahmin Atrocities Act

ఇక తెలుగు దేశం పార్టీ వాయిస్ ని బలంగా వినిపించే మహిళా నేతగా చాల రోజుల తర్వాత ఆమె తెరపైకి వచ్చారు.ఇక అలాగే ఉంటే చంద్రబాబు ఆమెకి మంచి ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉండేది అనే టాక్ కూడా వినిపించింది.

అయితే ఊహించని విధంగా ఎన్నికల తర్వాత సైలెంట్ అయిపోయిన యామిని సడెన్ గా ఆ పార్టీకి రాజీనామా చేసింది.

అదే సమయంలో బీజేపీ పార్టీకి దగ్గరైంది.

బీజేపీ పార్టీలో బ్రాహ్మణులకి ఎలాగూ మంచి ప్రాధాన్యత ఉంటుంది.అదే సమయంలో ఆ పార్టీ వాయిస్ ని ఏపీలో బలంగా వినిపించే మహిళా లీడర్ కోసం వారు చూస్తున్నారు.

ఈ నేపధ్యంలో ఆ పార్టీకి యామిని సాధినేని చేరడానికి సిద్ధమింది.ఇదిలా ఉంటే సాధినేని యామినీ బ్రహ్మణ ఎట్రాసిటి చట్టం కావాలని డిమాండ్ ని తెరమీదకి తీసుకొచ్చింది.

దీనిపై ఆమె గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ని కలిసి వినతి పత్రం కూడా ఇచ్చింది.రాష్ట్రంలో ఎస్టీ, ఎస్సీల మాదిరిగానే బ్రాహ్మణులు కూడా వేధింపులు ఎదుర్కొంటున్నారని వీటిని దృష్టిలో ఉంచుకొని బ్రాహ్మణ అట్రాసిటీ చట్టం తేవాలని గవర్నర్‌ ను కోరారు.

అయితే ఇప్పటి వరకు ఎవరు తీసుకురాని వాదనని తెరపైకి తీసుకొచ్చిన ఆమెకి బ్రాహ్మణ సంఘాల నుంచి ఎంత వరకు మద్దతు లభిస్తుంది అనేది చూడాలి.

తాజా వార్తలు

Sadineni Yamini Demand Brahmin Atrocities Act-brahmin Atrocities Act,governor,sadineni Yamini,tdp Related....