నేత‌ల‌ను చేర్చుకోవ‌డంలో దూసుకుపోతున్న బీజేపీ.. రేవంత్‌కు ఏమైంది..?

ఎంత చ‌రిత్ర ఉన్న రాజ‌కీయ పార్టీకి అయినా స‌రే స‌రైన నాయ‌కులు లేక‌పోతే కొట్టుకుపోతుంది.ఈ విష‌యం అన్ని పార్టీల‌కు వ‌ర్తిస్తుంది.

 Bjp Rushing To Recruit Leaders . What Happened To Revanth ..?, Revanth, Bjp,  Ba-TeluguStop.com

ఎంత‌టి ఘ‌న‌మైన చ‌రిత్ర ఉన్నా స‌రే ప్ర‌జ‌ల్లో పార్టీని న‌డిపించే బ‌ల‌మైన నేత‌లు ఆ పార్టీకి ప‌ట్టుకొమ్మ‌లు.అలాంటి వారిని ఎక్క‌డున్నా స‌రే వెతికి ప‌ట్టుకుని మ‌రీ పార్టీలో చేర్చుకోవ‌డం ఆనవాయితీ.

కానీ ఇప్పుడు తెలంగాణ‌లో జ‌రుగుతున్న ప‌రిస్థితి చూస్తే మాత్రం కాంగ్రెస్ చాలా వెన‌క‌బ‌డిపోయింద‌ని తెలుస్తోంది.పీసీసీ చీఫ్‌గా రేవంత్ నియామ‌కం అయినా కూడా పెద్ద‌గా మార్పు రాలేద‌ని చెబుతున్నారు.

ఎందుకంటే రేవంత్ ప‌గ్గాలు చేప‌ట్టిన కొత్త‌లో కాస్తంత జోష్ క‌నిపించింది.అప్పుడు కొంద‌రు పార్టీలోకి వ‌చ్చారు త‌ప్ప.

ఆ త‌ర్వాత ఎవ‌రూ ఆ పార్టీ వైపు చూడ‌ట్లేదు.మొన్న‌టికి మొన్న ఈట‌ల రాజేంద‌ర్ ను కాంగ్రెస్ లోకి తీసుకురావాల‌ని రేవంత్ ఎంత‌లా ప్ర‌య‌త్నించినా కుద‌ర‌లేదు.

అయితే అప్ప‌టికి ఇంకా రేవంత్ పార్టీ ప‌గ్గాలు తీసుకోలేదు.కానీ ఇప్పుడు పార్టీ చీఫ్ అయిన త‌ర్వాత కూడా ఎవ‌రినీ పెద్ద‌గా తీసుకురాలేక‌పోతున్నారు.

మొన్న‌టికి మొన్న ఉద్య‌మ నాయ‌కుడు, ఎన్జీవో నేత విఠ‌ల్‌, నిన్న తీన్మార్ మల్ల‌న్న కూడా బీజేపీలోకి వెళ్లారు.

Telugu Band Isanjay, Etala Rajender, Revanth, Ts Potics-Telugu Political News

అంటే వారిని త‌మ పార్టీలోకి తీసుకురావ‌డంలో రేవంత్ విఫ‌ల‌మ‌య్యారనే చెబుతున్నారు.వారంతా ఏదో ఒక పార్టీలో చేరాల‌ని అనుకున్న‌ప్పుడు వారికి క‌నీస భ‌రోసా ఇచ్చి కాంగ్రెస్‌లోకి తీసుకురావ‌డంలో రేవంత్ వెన‌క‌బ‌డ్డార‌నే చెప్పాలి.విఠ‌ల్ అటు ఉద్య‌మ కారుల‌కు అండ‌గా ఉంటున్నారు.

ఇటు తీన్మార్ మ‌ల్ల‌న్న ప్ర‌జ‌ల్లో మంచి ఇమేజ్ ఉన్న వ్య‌క్తి.వీరిద్ద‌రూ కీల‌క‌మైన వారే.

మ‌రి ఇలాంటి వారిని పార్టీలో చేర్చుకుంటే మ‌రింత బ‌ల‌ప‌డే ఛాన్స్ ఉంది.కానీ బీజేపీ ఆక‌ర్షిస్తున్నంత‌లా నేత‌ల‌ను కాంగ్రెస్ ఆక‌ర్షించ‌లేక‌పోతోంద‌ని తెలుస్తోంది.

రాబోయే రోజుల్లో అయినా రేవంత్ త‌న ప్ర‌భావం చూపిస్తారో లేదో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube