బిగ్‌ ట్విస్ట్‌ : మహాలో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్దమైన బీజేపీ  

Bjp Ready Farm The Governament In Maharastra-bjp And Siva Sena,bjp Leaders Meet In Governor,ncp And Congress

మహారాష్ట్రలో రాజకీయం ఇంకా రసవత్తరంగానే సాగుతోంది.బీజేపీ అత్యధిక సీట్లు దక్కించుకుని పెద్ద పార్టీగా ఆవిర్భవించింది.

Bjp Ready Farm The Governament In Maharastra-bjp And Siva Sena,bjp Leaders Meet In Governor,ncp And Congress Telugu Political Breaking News - Andhra Pradesh,Telangana Partys Coverage-BJP Ready Farm The Governament In Maharastra-Bjp And Siva Sena Bjp Leaders Meet Governor Ncp Congress

కాని మ్యాజిక్‌ ఫిగర్‌ చేరక పోవడంతో శివసేన మద్దతు తప్పనిసరి అయ్యింది.శివసేన పార్టీ ముఖ్యమంత్రి పీఠం కావాలని కోరవడంతో బీజేపీ నో చెప్పింది.

బీజేపీతో తెగతెంపులు చేసుకున్న శివసేన పార్టీ ఎన్సీనీ మరియు కాంగ్రెస్‌ పార్టీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్దం అయ్యింది.కాని శివసేనకు ఎట్టి పరిస్థితుల్లో ఛాన్స్‌ ఇవ్వ కూడదనే ఉద్దేశ్యంతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకు సిద్దం అవుతున్నట్లుగా సమాచారం అవుతోంది.

అక్కడ ఉన్నది బీజేపీకి అనుకూల గవర్నర్‌.ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రాజకీయ నడిపించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

అత్యధిక సీట్లు వచ్చిన తమకు ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పించాలని, తద్వారా తాము బలంను నిరూపించుకుంటామంటూ బీజేపీ గవర్నర్‌ను కోరనుంది.గవర్నర్‌ ఖచ్చితంగా మొదటి అవకాశం బీజేపీకి ఇవ్వబోతున్నాడు.అయితే బీజేపీకి అంత బలం ఉందా అనేది అనుమానమే.105 సీట్లు దక్కించుకున్న బీజేపీ ఇంకా 40 సీట్ల వరకు బయట పార్టీల నుండి మద్దతు పొందాల్సి ఉంది.

10 నుండి 20 వరకు అయితే ఏమో కాని 40 సీట్లు అంటే కష్టమే అంటున్నారు.కాని బీజేపీ ఏమైనా చేయగలదంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

తాజా వార్తలు

BJP Ready Farm The Governament In Maharastra Related....