ఓహో ఏపీ బీజేపీ కూడా ఇదే  నమ్ముకుందా ?

ఏపీలో బీజేపీ పరిస్థితి ఏమిటో అర్థం కాకుండానే ఉంది.పార్టీని బలోపేతం చేసుకునే అవకాశం ఉన్నా , ఆ పార్టీ నాయకులు నిర్లక్ష్యం చేస్తున్నట్లు గా కనిపిస్తున్నారు.

 Bjp President Somu Weeraraj Is Planning To Go On A Pilgrimage In Ap Ap Bjp, Somu-TeluguStop.com

వైసీపీ ప్రభుత్వం పై నిరంతరం పోరాటం చేసే అవకాశం ఉన్నా, తమ మిత్రపక్షమైన జనసేన ను కలుపుకుని ముందుకు వెళ్లే ఛాన్స్ ఉన్నా, ఆ విధంగా మాత్రం ప్రయత్నాలు చేయడం లేదు.అప్పుడప్పుడు ఏదో ఒక సమస్య పై హడావుడి చేయడం , ప్రభుత్వంపై విమర్శలు చేయడం తప్పించి , ఆశించిన స్థాయిలో అయితే ప్రభుత్వంపై పోరాటం చేయలేకపోతున్నారు.

కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నా,  ఏపీలో పార్టీని బలోపేతం చేసుకునే విషయంలో ఆ పార్టీ నాయకులు విఫలం అవుతున్నట్టు గానే కనిపిస్తున్నారు.తెలంగాణలో బీజేపీ పరిస్థితి మొదట్లో ఇదే విధంగా ఉన్నా,  ఆ పార్టీ నాయకులంతా సమిష్టిగా పార్టీని బలోపేతం చేయడం,  ఏపీ ప్రభుత్వంపై పోరాటం చేసే విషయంలో సక్సెస్ అవడం వంటి వ్యవహారాలు జరిగాయి.

ఇప్పుడు తెలంగాణలో ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర నిర్వహిస్తూ,  బిజెపి మైలేజ్ పెరిగేలా చేస్తున్నారు.

       అలాగే తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ కు ప్రధాన ప్రత్యర్థిగా బీజేపీని తీర్చిదిద్దడంలో నూ బండి సంజయ్ సక్సెస్ అయ్యారు.

ఇక బిజెపి గ్రాఫ్ మరింతగా పెంచేందుకు ఆయన పాదయాత్ర నిర్వహిస్తూ,  నియోజకవర్గాలను కవర్ చేసే విధంగా ప్లాన్ చేసుకున్నారు.అయితే సంజీవ్ పాదయాత్ర తో పాటు,  మిగతా పార్టీ నాయకులు సమిష్టిగా బిజెపిని ముందుకు తీసుకువెళుతూ టీఆర్ఎస్ పై విమర్శలు చేస్తుండడం, తదితర పరిణామాలు తెలంగాణ బీజేపీకి బాగా కలిసి వస్తున్నాయి.

బిజెపికి మైలేజ్ బాగా పెరిగిన క్రమంలో ఏపీ బీజేపీ కూడా అదే రూట్ ను ఫాలో అవ్వాలని , పాదయాత్ర నిర్వహించాలనే ప్లాన్ లో ఏపీ బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
   

Telugu Ap Bjp, Bandi Sanjay, Janasena, Janasenani, Padayathra, Pavan Kalyan, Som

   సంజయ్ మాదిరిగానే ఏపీ అంతట వీర్రాజు పాదయాత్ర చేసే ప్లాన్ లో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇదే విషయాన్ని పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లి తన పాదయాత్రకు అనుమతి తెచ్చుకునే వ్యూహంలో వీర్రాజు నిమజ్జనం అయినట్లు వార్తలు వస్తున్నాయి.అయితే ప్రస్తుత పరిస్థితుల్లో వీర్రాజు పాదయాత్ర చేపట్టినా, ఆశించిన ఫలితం దక్కుతుందా అంటే చెప్పలేని పరిస్థితి.

ఎందుకంటే పెద్ద ఎత్తున అభిమానులు కార్యకర్తలు ఉన్న జనసేన పార్టీని కలుపుకుని వెళ్లేందుకు వీర్రాజు పెద్దగా ఇష్టపడకపోవడం, ఆ పార్టీతో కలిసి రాజకీయంగా మైలేజ్ పొందే అవకాశం ఉన్నా,  వీర్రాజు ఆ విధంగా ప్రయత్నించకపోవడం,  ఇప్పుడు వీర్రాజు ఈ వయసులో పూర్తిస్థాయిలో ఆ యాత్ర సక్సెస్ చేయగలరా అనే ఒక సందేహం ఆ పార్టీ నేతల్లోనే ఎక్కువగా కనిపిస్తోంది.  ప్రస్తుతం పాదయాత్ర ద్వారా పార్టీ బలోపేతం కావడంతో పాటు , వ్యక్తిగత ఇమేజ్ పెరుగుతున్న క్రమంలో వీర్రాజు మాత్రం పాదయాత్ర ద్వారానే ఇమేజ్  పెంచుకునేందుకు చూస్తుండటం ఆసక్తికరంగా మారింది.

ఈ యాత్రకు పార్టీ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో లేదో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube