మధ్యాహ్నం పాలమూరులో బీజేపీ ప్రజాగర్జన సభ

తెలంగాణ బీజేపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ప్రజా గర్జన సభ ఇవాళ మహబూబ్ నగర్ జిల్లాలోని పాలమూరు వేదికగా జరగనుంది.ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరుకానున్నారు.

 Bjp Prajagarjana Sabha In Palamuru In The Afternoon-TeluguStop.com

మధ్యాహ్నం ప్రజా గర్జన సభ జరగనుండగా ప్రధాని మోదీ పర్యటనకు అధికారులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.ఇందులో భాగంగా ఎస్పీజీతో పాటు రాష్ట్ర పోలీసులతో సెక్యూరిటీని నియమించారు.

ఐదుగురు ఎస్పీలు, ఎనిమిది మంది అదనపు ఎస్పీలు, 18 మంది డీఎస్పీలు, 50 మంది సీఐలు, 170 మంది ఎస్సైలు మరియు 1640 మంది కానిస్టేబుల్స్ తో భద్రత కల్పించనున్నారు.అయితే ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ మొత్తం రూ.13,454 కోట్ల పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.మరోవైపు మహిళా రిజర్వేషన్ బిల్లు చట్టరూపం దాల్చిన తరువాత మోదీ పాల్గొంటున్న తొలి సభ ఇదే కావడం విశేషం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube