గవర్నర్ పేరుతో టీఆర్ఎస్ పై బీజేపీ రాజకీయం ?

ఏపీలో మాదిరిగానే తెలంగాణలోనూ మెల్లిమెల్లిగా బీజేపీ పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తోంది.ఇక్కడి అధికార పార్టీ టిఆర్ఎస్ పై రోజుకో విధంగా కొత్త ఎత్తుగడలు వేస్తూ, ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తోంది.

 Bjp Politics Against Trs Government, Trs Party, Kcr, Bjp, Governor Tamili Sai, C-TeluguStop.com

మొన్నటి వరకు నేరుగా టిఆర్ఎస్ ను ఇరుకున పెట్టే విధంగా వ్యవహరించినా, ఇప్పుడు మాత్రం గవర్నర్ ద్వారా, గవర్నర్ ను అడ్డంపెట్టుకుని రాజకీయం చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రం సహకారం టిఆర్ఎస్ ప్రభుత్వానికి బాగా అవసరం అవడంతో, బిజెపి ఎన్ని విమర్శలు చేసినా, టీఆర్ఎస్ నేతలు మాత్రం కిమ్మనడం లేదు.

ఇక కొద్ది రోజుల క్రితం తమిళ గవర్నర్ సైతం టిఆర్ఎస్ ను ఇరుకున పెట్టే విధంగా కరోనా వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారు.

తెలంగాణలో కరోనా ఈ స్థాయిలో విజృంభించాడు టిఆర్ఎస్ ప్రభుత్వం కారణం అన్నట్లుగా ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ విషయంలో అనేక ముందస్తు జాగ్రత్త చర్యలు  తీసుకోవాల్సిందిగా సలహాలు సూచనలు చేసినా, టిఆర్ఎస్ నేతలు ఈ వ్యవహారంపై నోరు మెదపలేదనే విషయాన్ని ఆమె నేరుగా ప్రస్తావించినా, టిఆర్ఎస్ నుంచి పెద్దగా రియాక్షన్ కనిపించలేదు.దీన్నే అవకాశంగా తీసుకుని బిజెపి మరింతగా టిఆర్ఎస్ ప్రభుత్వం పై విమర్శలు చేస్తూ వస్తోంది.

ఈ వ్యవహారంపై హుజూర్ నగర్ టిఆర్ఎస్ ఎమ్మెల్యే సైదిరెడ్డి గవర్నర్ వ్యాఖ్యలను ఖండిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినా, ఆ తరువాత టిఆర్ఎస్ పెద్దల సూచనతో దానిని తొలగించారు.

Telugu Bjp Trs, Corona, Governortamili, Saidi Reddy, Trs, Trstelangana-Telugu Po

అయినా ఆ వ్యవహారాన్ని బిజెపి వదిలిపెట్టకుండా, విమర్శలు చేస్తోంది.ఈ వ్యవహారంలో కాంగ్రెస్ కూడా తలదూర్చి విమర్శలు చేసింది.కానీ టిఆర్ఎస్ దీనికి కౌంటర్ ఇవ్వకుండా మౌనంగా ఉండిపోవడంతో, గవర్నర్ వ్యాఖ్యల్లో నిజం లేకపోలేదనే విషయం బాగా హైలెట్ అయ్యింది.

ఇటీవల గవర్నర్ తమిళ సై కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశమైనా, వీరి మధ్య భేదాభిప్రాయాలు పోలేదనే విషయం బాగా ప్రచారం అవుతోంది.గతంలో పనిచేసిన గవర్నర్ నరసింహన్ ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో టిఆర్ఎస్ కు వ్యతిరేకంగా వ్యవహరించినా, ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సక్యతగానే మెలుగుతూ వచ్చారు.

కానీ తమిళసై వ్యవహారం అందుకు భిన్నంగా ఉండడం, బిజెపి తెలంగాణలో వచ్చే ఎన్నికల నాటికి అధికారం సంపాదించాలనే అభిప్రాయంతోనే ఈ విధంగా వ్యవహరిస్తుండడం వంటి పరిణామాలు టిఆర్ఎస్ నేతలకు ఆందోళన కలిగిస్తున్నాయి.కేవలం అధికారంలోకి వచ్చేందు కే బిజెపి గవర్నర్ ద్వారా ఈ విధమైన రాజకీయం చేస్తోంది అనే అభిప్రాయం టీఆర్ఎస్ నేతల్లో ఉన్నా, నోరెత్తేందుకు సాహసించలేకపోతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube