పవన్ ఇష్టానికే అన్నీ వదిలేసిన బీజేపీ ! 

ఏపీలో ఎన్నికల సమయం దగ్గరకు వచ్చేసింది.అయినా బిజెపి – జనసేన పార్టీల మధ్య అంతంత మాత్రమే అన్నట్టుగా పరిస్థితి ఉంది.

 Bjp Political Strategy In Ap , Bjp, Tdp, Janasena, Janasenani, Chandrababu, Pava-TeluguStop.com

పేరుకే పొత్తు తప్ప , రెండు పార్టీలు కలిసి ఉమ్మడిగా కార్యక్రమాలు చేసేందుకు గాని,  ఉమ్మడి ప్రకటనలు చేసేందుకు గాని ఆసక్తి చూపించడం లేదు .ముఖ్యంగా బీజేపీ విషయంలో పవన్ కళ్యాణ్ చాలా నిరాశక్తితో ఉన్నారు.

Telugu Ap, Central Bjp, Chandrababu, Janasena, Janasenani, Jp Nadda, Pavan Kalya

2024 ఎన్నికల టిడిపి తో పొత్తు పెట్టుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టుగా కనిపిస్తున్నారు.ఇదే విషయాన్ని బిజెపి కేంద్ర పెద్దలు గ్రహించారు.గతంలో పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) బిజెపితో కలిసి ముందుకు వెళ్లే విషయం పై ప్రకటన చేశారు .బిజెపి రూట్ మ్యాప్ కోసం తాను ఎదురు చూస్తున్నాను అంటూ ప్రకటించారు.అయితే దీనిపై తాజాగా ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్చార్జి సునీల్ దియోధర్ స్పందించారు.

Telugu Ap, Central Bjp, Chandrababu, Janasena, Janasenani, Jp Nadda, Pavan Kalya

బిజెపి తరపున జనసేన( Janasen )కు అన్ని రోడ్ మ్యాప్ లు ఇచ్చేసామని,  ఈ విషయంలో ఏదైనా కావాలంటే పవన్ కళ్యాణ్ ని అడగాలి అంటూ మీడియాకు సునీల్ ధియోధర్ క్లారిటీ ఇచ్చారు.ఈ వ్యాఖ్యలతో బీజేపీ , జనసేన పొత్తు కొనసాగింపు వ్యవహారం జనసేన కోర్టులోనే బిజెపి విసిరినట్టుగా కనిపిస్తోంది.తాము రాబోయే ఎన్నికల్లో కలిసి ఎన్నికలకు వెళ్దామని పవన్ కు ఎంతగా చెబుతున్నా , పవన్ టిడిపి తో కలిసి ముందుకు వెళ్లేందుకే ఆసక్తి చూపిస్తున్నారనే ఆగ్రహం బిజెపి పెద్దలో వ్యక్తం అవుతున్నట్టుగా ప్రస్తుత పరిస్థితులు చూస్తే అర్థమవుతుంది.

ఇటీవల పవన్ ఢిల్లీకి వెళ్లారు.రెండు రోజులు పాటు అక్కడే మకాం వేశారు.

Telugu Ap, Central Bjp, Chandrababu, Janasena, Janasenani, Jp Nadda, Pavan Kalya

ఈ సందర్భంగా కేంద్ర బీజేపీ అగ్ర నేతలైన ప్రధాని నరేంద్ర మోది, అమిత్ షాలను కలిసేందుకు పవన్ ప్రయత్నించారు.  కానీ అది సాధ్యం కాకపోవడంతో,  ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్చార్జి మురళీధరన్ తో పాటు,  బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో( J.P.Nadda ) సమావేశం అయ్యారు.  దీంతో కర్ణాటక ఎన్నికలలో ప్రచారానికి దింపేందుకు బిజెపి పెద్దలు ఢిల్లీకి పిలిపించారనే ప్రచారం ఏపీలో జరిగింది.అయితే ఇప్పుడు బిజెపి ప్రకటించిన స్టార్ క్యాంపైనార్ల లిస్టులో పవన్ కళ్యాణ్ లేకపోవడంతో,  అప్పట్లో పిలిచింది కర్ణాటక ఎన్నికల ప్రచారానికి కాదని,  ఏపీ వ్యవహారాలకు సంబంధించి చర్చించారని అర్థమవుతుంది.

అయితే వారు ఏం చర్చించారు దానికి ఏ విధంగా స్పందించాలి అనేది క్లారిటీ లేకపోయినా,  ఇప్పుడు తాము రూట్ మ్యాప్ ఇచ్చేశామని, ఆ రూట్ మ్యాప్ గురించి పవన్ ను అడగాలంటూ బిజెపి పెద్దలు చెబుతుండడం చూస్తుంటే టిడిపిని  కలుపుకు వెళ్లేందుకు పవన్ ప్రయత్నిస్తున్నా, బీజేపీ అందుకు అంగీకరించకపోవడం , ఏపీలో బీజేపీ,జనసేన మాత్రమే ఎన్నికల్లో పోటీ చేస్తాయనే విషయమే జనసేన కి బీజేపీ ఇచ్చిన రూట్ మ్యాప్ గా అర్ధం అవుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube