బాబు ని ఎలా ఇరికిద్దాం..? బీజేపీ తీవ్ర కసరత్తు !       2018-06-15   04:18:06  IST  Bhanu C

చంద్రబాబు మీద ఏదో ఒకరకంగా కేసు నమోదు చేయించి రాజకీయంగా ఎదురుదెబ్బ కొట్టాలని కేంద్ర బీజేపీ పెద్దలు ఆలోచిస్తున్నారు. ఎప్పటి నుంచో ఢిల్లీ కేంద్రంగా ఈ తతంగం అంతా నడుస్తోంది. ఈ మేరకు తాజాగా.. ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలతో పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సమావేశం కావడం . చంద్రబాబు ప్రభుత్వం అవినితీకి ఆధారాలున్నాయని కొన్ని పత్రాలను అందించినట్లు ప్రచారం జరుగుతూండటంతో ఇది నిజమేనన్న భావన ప్రజల్లోకి వెళ్తోంది.

ప్రధానమంత్రి కార్యాలయంలోని కొంత మంది ఉన్నతాధికారులతో. కన్నా, జీవీఎల్, రామ్‌మాధవ్, పురందేశ్వరి లాంటి వారు రోజంతా చర్చల్లో పాల్గొన్నారట. ఇప్పటికే.. ఆంధ్రప్రదేశ్‌లో కీలక సాగునీటి ప్రాజెక్టులు చేపట్టిన ఓ కాంట్రాక్టర్ ని గతంలో ఢిల్లీకి పిలిపించి. చంద్రబాబుకు వ్యతిరేకంగా స్టేట్‌మెంట్ తీసుకున్నారని..ఇప్పటికే ఏపీ రాజకీయవర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆ స్టేట్‌మెంట్ ప్రకారం చంద్రబాబుపై కేసులు పెడతారని కూడా భావించారు. అయితే ఎలాంటి ఫిర్యాదులు లేకుండా. తమంతట తాముగా. కేసు నమోదు చేస్తే. రాజకీయ వేధింపులుగా అందరూ భావించే అవకాశం ఉండడంతో కొంచెం వెనక్కి తగ్గారు.

తాజాగా… పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.. ప్రభుత్వ అవినీతి అంటూ ఓ రిపోర్టును ఇచ్చినట్లు చెబుతున్నారు. నిజానికి పీఏసీలో ఏమైనా బయటపడితే అవి పాలనాపరమైన లోపాలే తప్ప. అవినీతి కాదు. అధికారుల నిర్లక్ష్యం వల్ల. ఆడిట్ లోపాల వల్ల తేడాలు కనబడతాయి. అవన్నీ కాగ్ రిపోర్టులే. చంద్రబాబుపై ఇప్పుడు ఎలాంటి కేసులు పెట్టినా అది తెలుగుదేశం పార్టీకే ప్లస్ అవుతుంది. ఆ విషయం తెలిసి కూడా.. బీజేపీ పెద్దలు.. ఏదో విధంగా చంద్రబాబును కార్నర్ చేయాలనే ఆలోచనలోనే ఉన్నారని. ఢిల్లీలో జరుగుతున్న తాజా పరిణామాలను బట్టి తెలుస్తోంది.