బీజేపీ వ్యూహం ఇదేనా ? కేసీఆర్ జగన్ మద్దతు వారికేనా ?

కేంద్రంలో మళ్లీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే అధికారంలోకి వస్తుందని దాదాపు మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ తమ ఫలితాలను వెల్లడించాయి.దీంతో మరోసారి మోదీ ప్రభుత్వం కొలువుతీరడం ఖాయం అయిపోయినట్టే అని అంత భావిస్తున్నారు.

 Bjp Plans About Cm Kcr And Ys Jagan-TeluguStop.com

కాకపోతే కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 273.అయితే ఆ విషయంలో బీజేపీలో ఎక్కడలేని ధీమా కనిపిస్తోంది.తమకు ఒక్క ఉత్తర ప్రదేశ్‌లోనే 74కు పైగా సీట్లు వస్తాయని, తాము ఒంటరిగానే 300కు పైగా సీట్లు గెలుస్తామని ఆ పార్టీ అగ్రనాయకులు చెబుతున్నారు.దీనికి తోడు దేశంలో ఎక్కువ లోక్‌సభ స్థానాలు బీజేపీకే వస్తాయని లెక్కలు చెబుతున్నా అదే సమయంలో విపక్షాల బలం కూడా ఈసారి పెరుగుతుందని వెల్లడించాయి.

గత ఎన్నికల్లో సాధించిన సీట్లు ఈసారి బీజేపీకి దక్కే అవకాశం కనిపించడంలేదు.ఎందుకంటే గతంలో ఆ పార్టీకి మిత్రపక్షంగా ఉండి ఎన్నికల్లో పోటీ చేసిన చాలామంది ఈ ఎన్నికల సమయంలో దూరం అయ్యారు.

అయితే కాంగ్రెస్, ఆ పార్టీ మిత్రపక్షాలైన కొన్ని ప్రాంతీయ పార్టీలు ఒక మాట మీదకు వచ్చి మోదీకి అడ్డంకులు సృష్టించే ప్రమాదం కూడా కనిపిస్తోంది.ఎలాగైనా తిరిగి అధికారంలోకి రావాలని, అందుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ ఎన్డీయే వైపు ఉండేలా చూసుకోవాలనేది నరేంద్ర మోదీ, అమిత్ షాల ఆలోచన.

ఈ నేపథ్యంలో యూపీఏ భాగస్వాములపై బీజేపీ కన్నువేసింది.ఏదో ఒకరకంగా ఆ పార్టీలను యూపీఏకు దూరం చేసి, తమతో కలుపుకుని అధికార పీఠాన్ని పటిష్టం చేసుకోవాలని చూస్తోంది.

-Telugu Political News

ఇక ఏపీ, తెలంగాణ విషయానికి వస్తే మొదటి నుంచి ఆ రెండు రాష్ట్రాల మీద బీజేపీ కన్ను వేసింది.తెలంగాణాలో టీఆర్ఎస్, ఏపీలో వైసీపీ జోరు మీద ఉండడంతో ఆ రెండు పార్టీల మద్దతు తమకే ఉంటుందని బీజేపీ భావిస్తోంది.అందుకే ఇటు సీఎం కేసీఆర్‌తో, అటు వైఎస్ జగన్‌తో స్నేహంగా మెలుగుతూ తమకే మద్దతు ఇవ్వాలంటూ సంకేతాలు పంపుతున్నారు.కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన సీట్లు బీజేపీకి రాకపోతే జగన్ , కేసీఆర్ పార్టల మద్దతు బీజేపీకి చాలా అవసరం అవుతుంది.

అందుకే ఆ రెండు పార్టీల మద్దతు తమకే ఉండేలా బీజేపీ ఎత్తులు వేస్తోంది.ఇక జగన్, కేసీఆర్ కూడా పైకి ఎన్ని మాటలు చెబుతున్నా ఆ సమయం వచ్చేసరికి బీజేపీకే మద్దతు ప్రకటించేలా వారి వ్యవహారం కనిపిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube