కేసీఆర్ పై బ్రహ్మాస్త్రం ! ఆర్టీసీని వాడుకునే పనిలో బీజేపీ

ఒకరు ఎదగాలంటే మరొకరిని తొక్కాలి అనే సూత్రం రాజకీయాల్లో ఎక్కువగా వాడబడుతుంది.ఒక పార్టీకి ప్రజాధారణ తగ్గితేనే మరో పార్టీకి సహజంగానే ఆదరణ పెరుగుతుంది.

 Bjp Plan To Using Rtc Employes Strike-TeluguStop.com

ఇప్పుడు ఇదే ఫార్ములాను ఉపయోగించుకుని తెలంగాణాలో బలపడడమే కాదు టీఆర్ఎస్ పార్టీని ఇబ్బందులకు గురిచేయాలని బీజేపీ ఎత్తుగడలు వేస్తోంది.ఇప్పుడు తెలంగాణాలో దాదాపు ఉద్యోగ సంఘాలన్నీ టీఆర్ఎస్ ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నాయి.

ఇప్పటికే రెవెన్యూ చట్టం లో సంస్కరణలు తీసుకురావడంపై ఉద్యోగులంతా ఆగ్రహంగా ఉన్నారు.ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు కూడా అదే రేంజ్ లో ఫైర్ అయిపోతున్నారు.

కేసీఆర్ తెలంగాణ కు ఏదో చేస్తాడనుకుంటే అందరికి విలన్ లా మారాడని అంతా ఆయన మీద చిర్రుబుర్రులాడుతున్నారు.ఇప్పుడు ఇదే అంశాన్ని ఉపయోగించుకుని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇబ్బందిపెట్టాలని బీజేపీ ప్లాన్ వేస్తోంది.

Telugu Bjprtc, Rtcemployes, Telanganartc-Telugu Political News

  ఇప్పటికే కరుడుగట్టిన బీజేపీ నాయకురాలిగా పేరుపడిన తమిళసై ను తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా బీజేపీ నియమించింది.ఆమె ద్వారానే తెలంగాణాలో బీజేపీ ని పటిష్టం చేయాలనే తెరవెనుక ఆలోచనను అమలు చేసేందుకు బీజేపీ కసరత్తు చేస్తోంది.అయితే అదంతా సీక్రెట్ గానే చేయాలని చూస్తోంది.మెల్లిగా ఓ వర్గాన్ని పూర్తిగా రెచ్చగొట్టి కేసీఆర్ పై వ్యూహాత్మకంగా ఎదురుదాడి చేయించేందుకు బీజేపీ ప్లాన్ వేసుకున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఆ ప్లాన్ లో భాగంగా గవర్నర్ ను మెల్లమెల్లగా రంగంలోకి దించుతోంది.ఆర్టీసీ కార్మికుల కుటుంబ సభ్యులతో నిరసనలు చేయిస్తూ గవర్నర్ తమిళ సై ఈ సమస్యను పరిష్కరించాలని వారితో చెప్పిస్తూ మైండ్ గేమ్ ఆడుతున్నట్టు అనుమానాలు టీఆర్ఎస్ నాయకులు వ్యక్తం చేస్తున్నారు.

Telugu Bjprtc, Rtcemployes, Telanganartc-Telugu Political News

  ప్రజల అవసరాల దృష్ట్యా గవర్నర్ తప్పనిసరి పరిస్థితుల్లో ఆర్టీసీ సమస్యపై సమీక్ష జరుపుతున్నట్టు అర్ధం అవుతోంది.ఆర్టీసీ సమ్మెపై ఇప్పటి వరకు గవర్నర్ కలుగజేసుకోలేదు.కనీసం అధికారుల నుంచి నివేదిక కూడా కోరలేదు.ఇప్పుడు ఈ అంశంపై తొలిసారి గవర్నర్ దృష్టిపెట్టే అవకాశం కనిపిస్తోంది.అదే కనుక జరిగితే తెలంగాణలో కొత్త గవర్నర్ దృష్టిపెట్టిన మొదటి సమస్య ఇదే అవుతుంది.తమిళ సై కి ముందు గవర్నర్ గా పనిచేసిన నరసింహన్ బీజేపీకి అనుకూలంగానే ఉన్నా కేసీఆర్ తో సన్నిహిత సంబంధాలు కొనసాగించారు.

అందుకే ఆయన స్థానంలో బీజేపీ వ్యూహాత్మకంగా తమిళసై ని రంగంలోకి దించింది.ఈ మార్పు ఖచ్చితంగా కేసీఆర్ ని ఇబ్బంది పెట్టేదే అని అప్పట్లోనే రాజకీయ విశ్లేషకులు అంచనా వేశారు.

అలా అదను కోసం వేచి చూసిన బీజేపీ నేతలు, ఇప్పుడు ఆర్టీసీ సమ్మె వ్యవహారంలో గవర్నర్ ను తెరపైకి తీసుకొస్తున్నారు.ఇది ఖచ్చితంగా టీఆర్ఎస్ ని ఇబ్బందుల్లోకి నెట్టడం ఖాయంగానే కనిపిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube