జనసేనానిని ప్రజలకి దూరం చేయడానికి వ్యూహాలు పన్నుతున్న బీజేపీ  

ఏపీ రాజకీయాలలో తనదైన ముద్ర వేసే ప్రయత్నంతో స్టార్ హీరో క్రేజ్ ని వదులుకొని రాజకీయాలలో అడుగు పెట్టిన హీరో పవన్ కళ్యాణ్. రాజకీయాలలో ఎంట్రీతో తన సత్తా ఏంటో చూపించిన పవన్ కళ్యాణ్ 2014 ఎన్నికలలో టీడీపీ అధికారంలోకి రావడంలో కీలక భూమిక పోషించారు. అయితే తాజా ఎన్నికలలో కొన్ని సమీకరణాలు, నెగిటివ్ ప్రచారం, అలాగే జగన్ పై ఉన్న సానుకూలత, జనసేన పార్టీ సంస్థాగత బలం లేకపోవడం వంటి కారణాల వలన పవన్ కళ్యాణ్ సీట్లు గెలుచుకునే స్థాయిలో ఓట్లు సంపాదించలేకపోయాడు. అయితే తెలుగు దేశం ఓటమికి మాత్రం కారణం అయ్యాడు..

జనసేనానిని ప్రజలకి దూరం చేయడానికి వ్యూహాలు పన్నుతున్న బీజేపీ-Bjp Plan To Damage Pawan Kalyan Wave In AP Politics

ఇదిలా ఉంటే సుదీర్ఘ రాజకీయ లక్ష్యంతో ప్రజల మధ్యకి వెళ్లి నాయకుడుగా నిరూపించుకోవడానికి సిద్ధం అవుతున్న పవన్ కళ్యాణ్ మీద ప్రజలలో కూడా ఓ రకమైన అభిమానం ఉంది. అతని నాయకత్వ లక్షణాలు గుర్తిస్తున్నారు. అయితే ఏపీలో బలపడాలని ప్రయత్నం చేస్తున్న బీజేపీ మాత్రం జనసేనాని బలాన్ని ఎలా అయిన తగ్గించాలని విశ్వ ప్రయత్నాలు చేస్తుంది.

తెలుగు దేశం పార్టీ బలం తగ్గిన కొలది జనసేన బలం పెరిగే అవకాశం ఉందని ఇప్పటికే గ్రహించిన బీజేపీ అధిష్టానం పవన్ కళ్యాణ్ ని పరోక్షంగా దెబ్బ తీసి ప్రజలలో అతని నాయకత్వంపై అనుమానం పెంచి జనసేన బలపడకుండా చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈ దారిలో ఇప్పటికే పవన్ కళ్యాణ్ మీద ఒకసారి, జనసేనకి మరో బలమైన లక్ష్మినారాయణ మీద నెగిటివ్ ప్రచారం చేసి ప్రజలలో అపోహలు పెంచే ప్రయత్నం చేసారు. ఇప్పుడు ఈ రెండు వ్యూహాలు ఫెయిల్ కావడంతో మరల పరోక్ష దాడినే నమ్ముకున్న బీజేపీ పవన్ ని దెబ్బ తీయడానికి కొత్త వ్యూహాలు పన్నుతుంది అని రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది.