బీజేపీ గేమ్ ప్లాన్ లో పావుగా మారుతున్న జగన్  

Bjp Plan To Build In Andhra Pradesh-ap Politics,bjp Plan To Build,janasena Party,tdp,ysrcp

ఏపీ రాజకీయాలలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ పాగా వేయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. దీనికి ఇప్పటికే రంగం సిద్ధం చేసుకున్న బీజేపీ టీం రామ్ మాధవ్ లాంటి వారిని ఏపీ మీద అస్త్రాలుగా ప్రయోగించింది. రెండు తెలుగు రాష్ట్రాలలో ఆధిపత్యం కోసం చూస్తున్న వారికి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చిన ఏపీలో మాత్రం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఉన్నంత కాలం బీజేపీకి అవకాశం ఉండదని రాజకీయ విశ్లేషకులు సైతం చెప్పేస్తున్నారు..

బీజేపీ గేమ్ ప్లాన్ లో పావుగా మారుతున్న జగన్-BJP Plan To Build In Andhra Pradesh

ఈ నేపధ్యంలో బీజేపీ పార్టీ ముఖ్యంగా తెలుగు దేశం నేతల మీద ద్రుష్టి పెట్టి వారిని తన వైపుకి లాక్కుంటుంది. తెలుగు నేతలు కూడా బీజేపీ వైపు చూస్తున్నారు. ఇక నెక్స్ట్ ఆప్షన్ గా ఉన్న పవన్ కళ్యాణ్ మాత్రం బీజేపీ కధపలేకపోతుంది.

ఇదిలా ఉంటే ఏపీలో బలపడాలంటే నెక్స్ట్ జగన్ ని కూడా టార్గెట్ చేయాలని భావించిన బీజేపీ కొత్త ఎత్తుగడని ఎత్తుకుంది. గత ఐదేళ్ళు ఏపీకి ఏమీ ఇవ్వకుండా మొండి చేయి చూపించి దారుణంగా మోసం చేసిన బీజేపీ బండారం పవన్ కళ్యాణ్, చంద్రబాబు బయట పెట్టి వారి మీద విస్తృతంగా వ్యతిరేక ప్రచారం చేయడంతో దానిని ప్రజలు విశ్వసించారు. అయితే ఈ సారి కూడా నిధుల విషయంలో ఏపీకి మొండి చేయి చూపించి అదంతా జగన్ వైఫల్యంగా చూపిస్తే అప్పుడు జగన్ మీద వ్యతిరేకత పెరగడం, బీజేపీ బలపడటం రెండూ ఒకేసారి జరుగుతాయని మోడీ టీం ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తుంది.

ఈ నేపధ్యంలో రైల్వే జోన్ కి, పోలవరం కి కేంద్ర బడ్జెట్ లో ఎలాంటి నిధులు కేటాయించకుండా మొండి చేయి చూపించారనే మాట బలంగా వినిపిస్తుంది. మరి ఏపీ రాజకీయాలలో బీజేపీ ఆడుతున్న ఆటలో జగన్ పావుగా మారే అవకాశం ఉందా, లేదా అనేది కాలమే నిర్ణయించాలి.