ఇప్పుడు తెలంగాణలో బీజేపీ వంతు! తాజాగా జితేందర్ రెడ్డి చేరికతో కొత్త ఉత్సాహం

ఇప్పటి వారు తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో కేంద్రంలో అధికార పార్టీ బీజేపీకి పెద్దగా అవకాశం లేదు.ఒక వేళ గెలిచిన ఏదో మొక్కుబడిగా ఒకటి రెండు సీట్లు మాత్రమె.

 Bjp Party Raise The Capability In Telangana-TeluguStop.com

అయితే తెలంగాణలో టీఆర్ఎస్ కి ప్రత్యామ్నాయంగా ఎదిగే ప్రయత్నం చేస్తున్న బీజేపే పార్టీ ఆ ప్రాంతంలో బలమైన నాయకులపై ద్రుష్టి పెట్టింది.ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ క్యాడర్ పూర్తిగా తగ్గిపోవడంతో పాటు, టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష కారణంగా గెలిచినా ఎమ్మెల్యేలలో చాలా మంది టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిపోయారు.

ఓ విధంగా చెప్పాలంటే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ లోపం స్పష్టంగా కనిపిస్తుంది.సీనియర్ నాయకులు ఎవరికి వారు పెత్తనం చేయాలనే ఆలోచన కారణంగా ఒకరితో ఒకరికి అస్సలు పొదగడం లేదు.

దీనిని అవకాశంగా తీసుకున్న బీజేపీ పార్టీ తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలపై కన్ను వేసింది.ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ సీనియర్ మహిళా నేత డికె అరుణ బీజేపీ తీర్ధం పుచ్చుకోవడం ఎంపీ సీటు సంపాదించడం జరిగింది.

తాజాగా టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి తాజాగా బీజేపీ పార్టీలో చేరాడు.మరికొంత మంది సీనియర్ నేతలు బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారనే అభిప్రాయం జితేందర్ వ్యక్తం చేసాడు.దీంతో తెలంగాణ రాజకీయాలో బీజేపీ శకం ఇప్పుడు మొదలుకాబోతుందా అనే అభిప్రాయం రాజకీయ వర్గాలలో వ్యక్తం అవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube