మనుషులు అక్కడ మనస్సులు ఇక్కడ: వారిపై బీజేపీ దృష్టిపెట్టిందా ?  

Bjp Party Focus On Tdp Leaders Join In Bjp Party-bjp Party,telugudesham Party,ycp,ys Jagan Mohan Reddy

ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ నేతల్లో ఒకటే ఆందోళన కనిపిస్తోంది.జగన్ అసలే సామాన్యుడు కాదు తమ మీద రాజకీయ కక్ష తీర్చుకుంటాడు అంటూ అప్పట్లో జగన్ మీద పెద్ద ఎత్తున విమర్శలు చేసిన వారంతా ఇప్పుడు భయం గుప్పిట్లో ఉన్నారు.అయితే వారికి పెద్ద ఉపశమనంగా బీజేపీ మారింది...

Bjp Party Focus On Tdp Leaders Join In Bjp Party-bjp Party,telugudesham Party,ycp,ys Jagan Mohan Reddy-Bjp Party Focus On TDP Leaders Join In Party-Bjp Telugudesham Ycp Ys Jagan Mohan Reddy

జగన్ భయం ఉన్న నాయకులంతా ఒక్కొక్కరిగా బీజేపీలో చేరిపోతున్నారు.ప్రస్తుతం ఏపీ, తెలంగాణ లోని టీడీపీ నాయకులకు షెల్టర్ జోన్ గా బిజెపి కనిపిస్తోంది.జగన్ రాజకీయ కక్ష నుంచి తప్పించుకోవాలంటే ఇదొక్కటే మార్గమని టీడీపీ కీలక నాయకులంతా భావిస్తున్నారట.

ఆ విధంగానే ఇప్పటికే చాలామంది నాయకులు బీజేపీలో చేరిపోయారు.ఇప్పటికే చేరిపోయిన వారు, చేరాలనుకున్నవారి ఆలోచనంత ఒకే విధంగా ఉందని తెలుస్తోంది.

Bjp Party Focus On Tdp Leaders Join In Bjp Party-bjp Party,telugudesham Party,ycp,ys Jagan Mohan Reddy-Bjp Party Focus On TDP Leaders Join In Party-Bjp Telugudesham Ycp Ys Jagan Mohan Reddy

బీజేపీలో చేరడం ద్వారా కేంద్రం నుంచి ఎటువంటి దాడులు ఎదురుకావని, రెండోది రాష్ట్రం లో కూడా తమ జోలికి స్థానిక ప్రభుత్వాలు వచ్చే సాహసం చేయలేవు అని వీరంతా బలంగా నమ్ముతున్నట్టు కనిపిస్తోంది.అదీ కాకుండా వైసీపీ హిట్ లిస్ట్ లో ముందున్న కోడెల శివప్రసాద్ వ్యవహారాన్ని ఇప్పుడు ఆ నేతలు ఉదాహరణగా తీసుకున్నట్టు కనిపిస్తోంది.

వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మాజీ స్పీకర్ వ్యవహారంపై ఫిర్యాదులు పెద్ద ఎత్తున మొదలయ్యాయి.కోడెల, ఆయన కొడుకు, కుమార్తె లను ఆధారాలతో సహా ఇరికించేశారు.ఈ కేసుల్లో అత్యంత పరువు తీసింది మాత్రం ఫర్నిచర్ దొంగతనం...

దీనిని ఏ రకంగా సమర్ధించుకోలేని పరిస్థితి లోకి టీడీపీ వెళ్ళిపోయింది.ఎందుకంటే ఫర్నిచర్ ను స్వయంగా తానే తరలించుకువెళ్లినట్టు కోడెల ఒప్పేసుకున్నాడు.దీంతో ఉన్న పరువు కాస్తా బజారున పడినట్టయ్యింది.

ఇక ఆ పరిస్థితుల్లో ఆయన గుండెపోటు కు గురయ్యి ఆసుపాత్రిలో చేరాల్సి వచ్చింది.

ఇప్పటికే బీజేపీలో చేరిన బాబు కోటరీ నాయకులు, రాజ్యసభ సభ్యులైన సీఎం రమేష్, సుజనా చౌదరి లు మనుషులు బీజేపీలో మనసులు టీడీపీలో అన్నట్టుగా ఉన్నారు.వీరు బీజేపీలో అకస్మాత్తుగా చేరడం వెనుక కారణాలు పరిశీలిస్తే బ్యాంక్ లకు ఎగనామాల కేసులో మాజీ కేంద్రమంత్రి సుజనా చౌదరిపై ఆరోపణలు వున్నాయి.ఇక రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ పై బిజెపి చేసినన్ని ఆరోపణలు అన్నీ ఇన్నీ కాదు.

ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నరసింహారావు కు రమేష్ కు మీడియా చర్చల్లో నిత్యం కొట్లాట సాగేది.రమేష్ బండారాలు బయట పెడతామని జివిఎల్ అనేక సవాళ్ళు విసిరారు.కానీ ఇంతలోనే మరోసారి కేంద్రంలో బీజేపీ, ఏపీలో వైసీపీ అధికారంలోకి రావడంతో ఆలస్యం చేయకుండా వీరిద్దరూ కాషాయ కండువా కప్పేసుకున్నారు...

అయితే ఆ పార్టీలో చేరినా వారంతా బాబు కి అనుకూలంగా పనిచేస్తుండడాన్ని బీజేపీ అగ్ర నాయకులు గుర్తించారు.అందుకే బీజేపీ లో ఉన్న బాబు వర్గం నాయకులకు గట్టిగా క్లాస్ పీకడమా లేక పార్టీ నుంచి బయటకు వెళ్లేలా పొగ పెట్టడమో చేయాలని చూస్తున్నారట.మరికొద్ది రోజుల్లో దీనికి సంబందించిన కసరత్తు మొదలుపెట్టేందుకు బీజేపీ అధిష్టానం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.