డిసెంబర్ లో ఏపీలో కీలక మార్పులు..ఆపరేషన్ “గరుడ క్లైమ్యాక్స్”       2018-06-08   23:17:24  IST  Bhanu C

రాష్ట్ర రాజకీయలలో భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయా..? ఎవరూ ఊహించని పరిణామాలు త్వరలో ఏపీ ప్రజలు చూడబోతున్నారా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు..ఏపీలో ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఏ పార్టీ ఎవరితో జట్టుకడుతుందో చివరి వరకూ చెప్పలేని పరిస్థితి ఒక పక్క ఆపరేషన్ గరుడ జోరుగా సాగిపోతుంటే మరో పక్క లోకల్ పాలిటిక్స్ ఎన్నో ట్రిక్స్ ప్లే చేస్తూ వడివడిగా అడుగులు వేస్తున్నాయి..ఈ పరిణామాలతో నేతల్లో టెన్షన్ పెరిగిపోతుంటే ప్రజలు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తూ పరిస్థితులని గమనిస్తున్నారు అయితే…

డిసెంబర్ లో ఏపీ లో జరుగబోయే పరిణామాలు మాత్రం కీలక మార్పులని తీసుకురాబోతున్నాయి అంటున్నారు విశ్లేషకులు..తాజా సమాచారం ప్రకారం..ఏపీలో డిసెంబర్ లో ఒకే వేదికపైకి పవన్ ,జగన్ చేరి ఒక కీలక ప్రకటన చేయనున్నారట…అంతేకాదు అదే వేదికపైకి మోడీ సైతం హాజరయ్యి జగన్ పవన్ ల ధైర్య సాహసాలని ప్రజలకి చెప్తూ ఏపీ పై వారాల జల్లులు కురిపించానున్నారని..అప్పటివరకూ మోడీ పై బీజేపి పై గుర్రుగా ఉండే ప్రజలు ఆ వారాలకి ఫిదా అయిపోవడం ఖాయం అంటున్నారు..

అయితే అత్యంత కీలకమైన విషయం ఎలా బయటకి లీక్ అయ్యింది అంటే దానికి కూడా రీజన్ లేకపోలేదట జగన్ అత్యంత సన్నిహితుడు అయిన ఒక ఎంపీ పార్టీ ని వీడుతాను అంటూ జగన్ దగ్గరకి వచ్చినప్పుడు ఆయనకీ ధైర్యం చెప్పే క్రమంలో జగన్ ఈ విషయాన్ని వెల్లడి చేశారట..అయితే ఈ విషయం ఆనోటా ఈ నోటా బయటకి పోక్కేసింది.

అయితే డిసెంబర్ 22 న ఈ సభ ఉంటుందనే డేట్ కూడా ఫిక్స్ చేసేశారు..ఈ సభా వేదికపై నుంచీ జగన్ ,పవన్ ల పొత్తు ఉండబోతోంది అంటున్నారు..

అయితే ఇక్కడ అసలు విషయం ఏమిటంటే ఎన్నికలకు మరో ఆరు మాసాలు కంటే తక్కువ సమయం ఉంటుంది కనక ఈ ఇద్దరు యువనేతలు ప్రచారానికి దిగితే ప్రజల్లో మంచి ఊపు వస్తుందని రాజకీయ ముఖ చిత్రం మారిపోతుందనేది బీజేపి పెద్దల ఆలోచన..ఆపరేషన్ గరుడలో చివరి ఘట్టం ఇదే అయినా మధ్య మధ్యలో కొన్ని ట్విస్ట్ లు ఉంటాయట రాబోయే రెండు మూడు నెలలలో తెలుగుదేశం పార్టీ కీలక నేతల్ని ఇబ్బందులకి గురిచేసే కీలక ఘటనలు కూడా జరగుతాయట..అయితే ఆ పరిణామాల తరువాత వైసీపి జనసేన లోకి భారీ వలసలు ఉంటాయని బిజెపి పెద్దలు అందుకు తగ్గట్టుగా వ్యుహాలని సిద్దం చేశారని అంటున్నారు విశ్లేషకులు..మరి ముందు ముందు ఏపీ రాజకీయ ముఖ చిత్రం ఎలా ఉంటాబోతోందో వేచి చూడాలి.