ఓహో బీజేపీ ఇలా డిసైడ్ అయ్యిందా ? ఆ పార్టీకి నిరాశేనా ?

Bjp Not Intrested On Tdp Alliance

ఏదో రకంగా ఏపీలో బిజెపి, జనసేన పార్టీలతో పొత్తు పెట్టుకుని, మళ్ళీ 2014 ఎన్నికల ఫలితాలను రిపీట్ చేయాలనే ఆశ, ఆలోచనతో టిడిపి అధినేత చంద్రబాబు ఉన్నారు.అందుకే సమయం వచ్చినప్పుడల్లా బిజెపికి దగ్గరయ్యేందుకు ఆయన అనేక ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు.

 Bjp Not Intrested On Tdp Alliance-TeluguStop.com

తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తుకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అని, పవన్ ద్వారా ఏదో రకంగా బిజెపిని పొత్తుకు ఒప్పిస్తే, తమ మూడు పార్టీల కాంబినేషన్లో మళ్లీ అధికారంలోకి వస్తాయి అనే ఆశాభావంతో చంద్రబాబు ఉంటూ వస్తున్నారు.ఇక ఇటీవల కాలంలో  బిజెపికి దగ్గరయ్యేందుకు అనేక రకాల ప్రయత్నాలు బాబు చేశారు.

అయితే బిజెపి మాత్రం టిడిపి విషయంలో ఒక క్లారిటీతో ఉంది.ఎట్టి పరిస్థితుల్లోనూ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోకూడదు అని బలంగా ఫిక్స్ అయిపోయింది.

 Bjp Not Intrested On Tdp Alliance-ఓహో బీజేపీ ఇలా డిసైడ్ అయ్యిందా ఆ పార్టీకి నిరాశేనా -Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇప్పటికే ఈ విషయంలో ఏపీ బీజేపీ నాయకులకు అధిష్టానం పెద్దలు ఒక క్లారిటీ ఇచ్చారట.ఎట్టి పరిస్థితుల్లోనూ టిడిపి తో పొత్తు ఉండదు అని, జనసేనతో మాత్రమే కలిసి వెళ్తామని , టిడిపి ట్రాప్ లో పడవద్దని సూచించడంతో, ఇప్పుడు ఏపీ బిజెపి నేతలకు ఒక క్లారిటీ వచ్చేసిందట.

తెలుగుదేశం పార్టీకి ఎంత దగ్గరయ్యేందుకు ప్రయత్నించినా, ఆ పార్టీనీ దూరంగానే పెట్టాలని, ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నా బిజెపికి కలిసి వచ్చేది ఏమీ ఉండదని, గతంలో పొత్తు పెట్టుకున్న తర్వాత తలెత్తే పరిణామాలు అన్నిటిని బీజేపీ పెద్దలు గుర్తు చేసుకుంటున్నట్లు సమాచారం.

Telugu Ap, Ap Bjp, Ap Bjp Alliance, Badvel Elections, Bjp, Bjp-janasena Alliance, Janasenani, Pavan Kalyan, Somu Veeraju, Sunil Dhiyodhar, Tdp, Ysrcpjagan-Telugu Political News

టిడిపి నుంచి బిజెపిలో చేరిన రాజ్యసభ ఎంపీలు సుజనా చౌదరి, టీజీ వెంకటేష్, సీఎం రమేష్ వంటి వారి విషయంలో ఇప్పటికే బిజెపి ఏపీ వ్యవహారాల ఇన్ చార్జి సునీల్ ధియోధర్ ఒక క్లారిటీ ఇచ్చేశారు.వారు కేవలం బీజేపీని పార్కింగ్ ప్లేస్ గా మాత్రమే భావిస్తున్నారని వ్యాఖ్యానించడంతో వారిద్వారా బిజెపికి టిడిపి దగ్గరయ్యేందుకు ప్రయత్నించినా ఉపయోగం లేదనే విషయాన్ని సునీల్ ధియోధర్ క్లారిటీ ఇచ్చేశారు.టీడీపీకి దగ్గరయ్యేందుకు బాబు ఇక ఎన్ని ప్రయత్నాలు చేసిన సంగతి అందరికీ అర్థమైపోయింది.

అయినా బాబు మాత్రం తన నిరసన దీక్ష ముగిసిన అనంతరం ఢిల్లీకి వెళ్లి ఏపీ బీజేపీ పెద్దలను కలిసి, వైసీపీ ప్రభుత్వం పై ఫిర్యాదు చేయడంతో పాటు, పొత్తు అంశాన్ని ప్రస్తావించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

#Bjp Alliance #Pavan Kalyan #Badvel #AP Bjp #Janasenani

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube