కథనరంగంలోకి దూకేదెవరు ? జనసేనా బీజేపీనా ? 

పంచాయతీ మున్సిపల్ ఎన్నికల పోరు ముగియడంతో ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలు ప్రధానంగా తిరుపతి లోక్ సభ నియోజకవర్గం పై దృష్టి పెట్టాయి.ఇప్పటికే ఇక్కడ తెలుగుదేశం పార్టీ తరపున మాజీ కేంద్రమంత్రి పనబాక లక్ష్మి ని అభ్యర్థిగా ప్రకటించగా, వైసీపీ నుంచి డాక్టర్ గురుమూర్తి పేరు ప్రకటించారు.

 Bjp Not Announced On Tirupathi Loksabha Candidate, Janasena, Bjp, Tdp, Ysrcp,ele-TeluguStop.com

అలాగే కాంగ్రెస్ పార్టీ సైతం మాజీ ఎంపీ చింతా మోహన్ ను రంగంలోకి దింపి ఈ పోరులో తాము ఉన్నామని ప్రకటించుకుంది.కానీ మొదటి నుంచి ఈ తిరుపతి లోక్ సభ నియోజకవర్గం పై దృష్టి పెట్టి హడావుడి చేస్తున్న జనసేన, బీజేపీ ఇప్పుడు సైలెంట్ అయిపోవడం , ఇక్కడ నుంచి జనసేన సహకారంతో బిజెపి అభ్యర్థిని పోటీకి దింపుతామని బీజేపీ ప్రకటించడం,  దానికి జనసేన సైతం మద్దతు తెలపడం వంటివి జరిగాయి.

కానీ ఉప ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ మొదలైనా, బీజేపీ తమ ఉమ్మడి అభ్యర్థి ఎవరు అనేది ప్రకటించలేదు.దీంతో అసలు బిజెపి జనసేన పార్టీ లు తిరుపతి లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసే ఆలోచనలో ఉన్నాయా లేదా అనే సందేహాలు ఎన్నెన్నో జనాల్లో మొదలయ్యాయి.

ఇటు జనసేన బిజెపి ఇప్పటికే తిరుపతి ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాయి.ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతి లో గెలిచి తమకు ఇక్కడ పట్టు ఇక్కడా ఉంది అని నిరూపించుకోవాలని బీజేపీ-జనసేన భావించాయి.

అధికార పార్టీ వైసీపీ దూకుడును తట్టుకుని ఎలా ముందుకు వెళ్లాలి అనే విషయంలో ఎంతగానో తర్జన భర్జనలు పడుతున్నారు.ముందు నుంచి ఎంతగా హడావుడి చేస్తున్న ఇప్పటికీ అభ్యర్థిని ఎందుకు ప్రకటించడం లేదు అనేది అనేక సందేహాలను రేకెత్తిస్తోంది.

ఇక బీజేపీతో పొత్తు పెట్టుకున్న జనసేన సైతం చాలా నిరుత్సాహంగా నే ఉన్నట్టు గా కనిపిస్తోంది.

తాము పోటీ చేస్తామని ముందు నుంచి ప్రకటించినా,  బిజెపి పట్టించుకోలేదు అని గుర్రుగా ఉంది.

పంచాయతీ మున్సిపల్ ఎన్నికలలో చాలాచోట్ల బిజెపికి జనసేన దూరంగానే ఉంది.అలాగే నిన్న ఏపీ లో ఇసుక ర్యాంపు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బిజెపి ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించగా, దానికి సైతం జనసేన దూరంగా ఉండటం తో బిజెపి జనసేన పొత్తు ఉందా లేక ఆ పొత్తు రద్దు అయ్యిందా అనేది రెండు పార్టీల నాయకులకు అనేక సందేహాలను కలిగిస్తోంది.

అసలు అభ్యర్థిని ప్రకటించేందుకు బీజేపీ ఎందుకు ఇంతగా ఆలోచిస్తోంది అనేది అంతుపట్టడం లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube