సిద్దిపేటలో నిరసన గళం మొదలైందా? బీజేపీ నెక్స్ట్ టార్గెట్ సిద్దిపేటేనా?

తెలంగాణ వ్యాప్తంగా టీఆర్ఎస్ ఎక్కడైతే బలంగా ఉందో ఆ నియోజకవర్గాలను టార్గెట్ చేస్తూ ఆయా నియోజకవర్గాలలో కూడా బీజేపీ జెండా ఎగరవేయాలని భావిస్తోంది.టీఆర్ఎస్ బలంగా ఉన్న నియోజకవర్గాలలో ప్రజల వ్యతిరేకతను ఆసరాగా చేసుకొని ఆ నియోజకవర్గాలలో బీజేపీ బలపడాలని భావిస్తోంది.

 Bjp Targets Siddipet, Siddipet, Bjp, Harish Rao, Trs,siddipet Constituency-TeluguStop.com

కాని అన్ని నియోజకవర్గాలలో ఒక పరిస్థితి ఉంటే సిద్దిపేట నియోజకవర్గంలో పరిస్థితి వేరుగా ఉంటుంది.కాని ఇప్పుడు బీజేపీ మంత్రి హరీష్ రావు నియోజకవర్గం సిద్దిపేట పీఠం మీద గురిపెట్టినట్లుగా రాజకీయ వర్గాలలో చర్చలు జరుగుతున్నాయి.

కాని సిద్దిపేటలో ఇటీవల ప్రజలు నిరసన వ్యక్తం చేయడం వారికి స్థానిక బీజేపీ నాయకులు మద్దతు పలకడం చూస్తుంటే బీజేపీ గురి ఖాయమే అని చర్చించుకుంటున్నారు.సిద్దిపేట అభివృద్ధిలో దూసుకుపోతోంది వ్యక్తిగతంగా హరీష్ రావుకు ప్రజల్లో మంచి పేరుంది.

ఇవన్నిటినీ దాటుకొని సిద్దిపేటలో సత్తా చాటడమంటే అది ఒక సంచలనమే అని చెప్పవచ్చు.అది కాక అక్కడ హరీష్ రావుకు ఓట్ల సమయంలో ప్రజలు చందాలు వేసుకొని మరీ హరీశ్ రావు ఎన్నికల ప్రచారానికి డబ్బులు అందజేస్తారు.

అంతలా హరీష్ రావు అంటే సిద్దిపేట ప్రజలకు అభిమానం.మరి బీజేపీ వ్యూహం ఫలిస్తుందో లేదా అనేది చూడాల్సి ఉంది

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube