బీజేపీ కొత్త జాతీయ కార్యవర్గం ! ఏపీ తెలంగాణ నుంచి ఎవరెవరంటే ? 

2024 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జాతీయ స్థాయిలో బీజేపీ కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేసింది.ప్రస్తుతం ఉన్న కార్యవర్గంలో మార్పులు చేర్పులు చేపట్టారు .

 Bjp, Ap Bjp, Telangana Bjp, Kishan Reddy, Kanna Lakshmi Narayana, Daggubati Pura-TeluguStop.com

పూర్తిగా ఎలక్షన్ మూడ్ లోనే కొత్త కార్యవర్గాన్ని ఎంపిక చేసినట్లుగా కనిపిస్తున్నారు.దేశవ్యాప్తంగా బిజెపికి వ్యతిరేక పవనాలు వీస్తున్న సమయంలో, ఈ కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేసి మరింత దూకుడుగా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్టు గా కనిపిస్తోంది .ఇది ఇలా ఉంటే ఈ కొత్త జాతీయ కార్యవర్గంలో ఏపీ తెలంగాణకు ప్రాధాన్యం కల్పించారు.ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కొత్త కార్యవర్గాన్ని ప్రకటించారు.

నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ,  నేషనల్ ప్రత్యేక ఆహ్వానితులు , శాశ్వత ఆహ్వానితులతో జాబితాను వెల్లడించారు.

నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ లో ఏపీ నుంచి మాజీ ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ,  తెలంగాణ నుంచి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, మాజీ ఎంపీ గరికపాటి మోహన్ రావు లకు ఈ కమిటీలో స్థానం లభించింది.

ఇక జాతీయ ఆఫీస్ బేరర్ల లో తెలంగాణ నుంచి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ను నియమించారు.ఇక జాతీయ ప్రధాన కార్యదర్శి బాధ్యతలను దగ్గుబాటి పురంధరేశ్వరి కి ఇచ్చారు.

Telugu Amit Shah, Ap Bjp, Dk Aruna, Kishan Reddy, Lk Advani, Narendra Modi, Niti

ఏపీ నుంచి సతీష్ కుమార్ కు జాతీయ కార్యదర్శి లో  జాబితా లో స్థానం లభించింది.ఇక ప్రత్యేక ఆహ్వానితులుగా తెలంగాణ నుంచి విజయశాంతి , ఈటెల రాజేందర్ లను ఎంపిక చేశారు.నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ లో ప్రధాని నరేంద్ర మోదీ, ఎల్.కె.అద్వానీ , డాక్టర్ మురళీ మనోహర్ జోషి, మాజీ జాతీయ అధ్యక్షులు కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్ , అమిత్ షా, నితిన్ గడ్కరీ, రాజ్యసభ ఫ్లోర్ లీడర్ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, నేషనల్ ఆఫీస్ బేరర్స్ తో మొత్తం 80 మంది సభ్యులను ఆహ్వానించారు జాతీయ కార్యనిర్వాహక కమిటీ లో 50 మంది ప్రత్యేక ఆహ్వానితులు, 179 శాశ్వత ఆహ్వానితులు, ఇలా చాలా మందికే కొత్త కమిటీలో స్థానం కల్పించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube