బెంగాల్ లో గెలుపు కోసం బీజేపీ తీసుకున్న నిర్ణయానికి దేశం మొత్తం షాక్..??

త్వరలో పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే ప్రధాన పార్టీలు అన్నీ జరగబోయే ఎన్నికలకు రెడీ అవుతున్నాయి.

 Bjp With Twenty Two Central Ministers To Campaign In West Bengal Assembly  Elect-TeluguStop.com

ఇలాంటి తరుణంలో బెంగాల్ రాష్ట్రంలో ఎన్నికలలో ఎవరిది గెలుపు అని ప్రముఖ సర్వేలు నిర్వహిస్తున్న వాటిలో పోటాపోటీ తృణమూల్ వర్సెస్ బిజెపి పార్టీ మధ్య గెలుపు దోబూచులాడుతున్నట్లు ఫలితాలు వస్తున్నాయి.ఇదిలా ఉంటే అధికారం నిలబెట్టుకోవాలని సీఎం మమతా బెనర్జీ ఎక్కడికక్కడ తనదైన శైలిలో రాజకీయం చేస్తూ ఉంది.

మరోపక్క బిజెపి పార్టీ మమతా బెనర్జీ పార్టీని ఎలాగైనా గద్దెదించి బెంగాల్ రాష్ట్రంలో కాషాయ జెండా ఎగురవేయాలని ఆరాటపడుతుంది.

ఇప్పటికే కేంద్ర హోం మంత్రి అమిత్ షా పలుమార్లు బెంగాల్ రాష్ట్రంలో పర్యటించడం జరిగింది.

పరిస్థితి ఇలా ఉండగా బెంగాల్ రాష్ట్రంలో కచ్చితంగా రాబోయే ఎన్నికలలో విజయం సాధించాలని బిజెపి ఓ నిర్ణయానికి వచ్చినట్లు.జాతీయ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.పూర్తి విషయంలోకి వెళితే బెంగాల్ రాష్ట్రంలో జరగబోయే ఎన్నికల ప్రచారంలో కేంద్రానికి చెందిన 22 మంది మంత్రులను బరిలోకి దింపే ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.దీంతో ఈ వార్త తెలుసుకుని దేశవ్యాప్తంగా వివిధ పార్టీలకు చెందిన నాయకులు షాక్ అవుతున్నారు.

ఇదే తరహాలో హైదరాబాద్ రాష్ట్రంలో జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో బిజెపి పార్టీకి చెందిన కీలక నాయకులు అప్పట్లో ప్రచారం చేయడం అందరికీ తెలిసిందే.ఆ తరహాలోనే పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో జరగబోయే ఎన్నికలకు కేంద్ర మంత్రులు రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

Telugu Bengal-Political .

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube