ఏపీకి బీజేపి అన్యాయం..కారణాలు ఇవే..

ఓ పక్క ఏపీకి తీవ్రమైన అన్యాయం జరుగుతోంది.బడ్జెట్లో ఏపీ ప్రజలకి నూతన రాష్ట్రానికి ఎంతో నష్టం వాటిల్లుతుంటే ఎందుకు టిడిపి ఎంపీలు మిన్నకుండి పోయారు.

 Bjp Negligence Ap In Budget 2018..reasons Is..-TeluguStop.com

ఇలాంటి పరిస్థితులు జరుగుతాయని ముందే ఓ అంచనాకి వచ్చే అధికారం టిడిపి ఎందుకు సైలెంట్ అయ్యింది.ఇదే అన్యాయం మిగిలిన రాష్ట్రాలలో జరిగితే.

వారు ఇలానే నోరు మెదపకుండా ఉంటారా.? జైట్లీ తన ప్రసంగాన్ని చదువుతూ బడ్జెట్ ప్రతుల్ని పక్కకి తిప్పుతూ చదువుతూ ఉంటే.మన ఎంపీలు తలలు పక్కకి తిప్పుకున్నారు.ఇదెక్కడి ఘోరం అని వారించిన వారు కూడా లేరు.

జైట్లీ ఏపీకి అసలు సమస్యలు ఏమి లేవని భావిస్తున్నారా.ఏపీలో పెండింగ్ లో ఉన్న ఎన్నో పనులు కనపడలేదా.? పోలవరం నుంచీ.నవ్యాంధ్ర వరకూ ఏపీ ప్రజల కోరికలు.

విజ్ఞప్తులు వారికి వినపడలేదా అంటే అన్నీ తెలుసు…కానీ అసలు కారణం ఏమిటంటే.ఏపి ప్రభుత్వం చేతకాని తనం…ఎంపిల్లో లోపించిన చిత్తశుద్ది, అనైక్యత.

ఈ కారణాలనే కేంద్రంలోని నరేంద్రమోడి ప్రభుత్వం అలుసుగా అవకాశంగా తీసుకుంది.ప్రతీ సారి నిధుల కోసం వేచి చూసే ధోరణిలో ఉంటున్నాం మనం.ఏపీకి ఈ పరిస్ధితికి కారణం ఒక్కటే బలమైన రాజకీయ నాయకత్వం లేకపోవటమే

ఏపీ అధికార పార్టీ సీఎం చంద్రబాబు కి “ఓటుకు నోటు” భయం గట్టిగా కేంద్రాన్ని నిలదీయాలి అంటే.వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికేమో “సిబిఐ” కేసుల భయం.ఎదురు తిరుగుదామంటే.మిగిల పార్టీలు అంతకు అంతే.

అందుకే బీజేపి ఎంతో ప్రశాంతంగా ఉంది ఎవరు గట్టిగా అడిగే వారు లేరని…పోనీ ఎపీకి వరాలు ఇవ్వాలంటే బీజేపి తోక పార్టీ అయ్యింది తప్ప తనంతట తానుగా పట్టుమని 10 సీట్లు కూడా గెలుచుకోలేదు.అందుకే సమస్యల పరిష్కార విషయంలో బీజేపి ఏపీ ని చిన్న చూపు చూస్తోందనేది విశ్లేషకుల అభిప్రాయం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube