చప్పట్లు,దీపాలు అయిపోయాయి, ఇప్పుడు మోడీజీ మరో కొత్త టాస్క్  

Bjp Narendra Modi Feed The Need Lights Off Program Indian Prime Minister Corona Virus India Lock Down Bjp Bjp Party Workers - Telugu Bjp, Bjp Party Workers, Corona Virus, Feed The Need, India Lock Down, Indian Prime Minister, Lights Off Program, Narendra Modi

గత నెలలో చప్పట్ల తో డాక్టర్ల కు కృతజ్ణతలు చెప్పాలి అని కోరిన ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 5 వ తేదీ అనగా నిన్న(ఆదివారం) రాత్రి 9 గంటల సమయంలో 9 నిమిషాల పాటు ఇంట్లో లైట్స్ ఆఫ్ చేసి బాల్కనీ లో గాని బయటగాని క్యాండిల్స్,దీపాలు,మొబైల్ లైట్స్ తో వెలుగులు నింపాలి అని కోరారు.అయితే మోడీజీ చెప్పినట్లు గానే వేల కోట్ల మంది ఆ పనులను చేసి చూపగా ఇప్పుడు తాజాగా ప్రధాని మోడీ మరో టాస్క్ ను సిద్ధం చేసినట్లు తెలుస్తుంది.

 Bjp Narendra Modi Feed The Need Lights Off Program Indian Prime Minister Corona Virus India Lock Down Bjp Bjp Party Workers

అయితే ఈ టాస్క్ కేవలం పార్టీ శ్రేణులకు మాత్రమే నని తెలుస్తుంది.బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ శ్రేణులను ఉద్దేశించి మోడీ నూతన టాస్క్ ను ఇచ్చారు.

కార్యకర్తలు అంతా సోమవారం ఒక పూట భోజనం మానేయాలని సూచించారు.

చప్పట్లు,దీపాలు అయిపోయాయి, ఇప్పుడు మోడీజీ మరో కొత్త టాస్క్-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఇలా చేసి లాక్‌డౌన్ కారణంగా ఆహారం దొరక్క ఇబ్బందులు పడుతున్న వారికి సంఘీభావం తెలపాలన్నారు.

పార్టీ ఆవిర్భావం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.కార్యకర్తలకు శుభాకాంక్షలు చెబుతూ.

కరోనా మహమ్మారి ప్రభలిన సమయంలో పేద వారికి అండగా నిలవాలన్నారు.జెండా ఆవిష్కరణలో సామాజిక దూరం పాటించాలని సూచించారు.

లాక్‌డౌన్‌లో ఇబ్బందులను ఎదర్కొంటున్నవారికి బీజేపీ కార్యకర్తలు సాయం చేయాలని, ప్రతి కార్యకర్త ఆరుగురు పేదవారికి ఆహార పదార్థాలు అందేలా చూడాలని సూచించారు.‘ఫీడీ ద నీడ్‌’ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వామి కావాలని మోడీ పిలుపునిచ్చారు.

అలానే రెండు సీట్ల నుంచి ఇంత విరాట్ రూపంగా పార్టీ ఎదగడానికి ఎందరో కార్యకర్తలు, నేతలు కృషి చేశారని, వారి కృషి వల్లే పార్టీ నేడు ఇంతగా ఎదిగిందని ఆయన కొనియాడారు.మరోపక్క పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా కార్యకర్తలు పేదవారికి సాయం చేయాలనీ కోరారు.

పేదవారికి మాస్కులు కూడా పంపిణి చేయాలంటూ ఆయన సూచించారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు