సిద్ధార్థ్ ఆరోపణల్లో నిజం లేదు..!

తమిళనాడు బీజేపీ తనపై కుట్ర పన్నిందని.తమిళనాడు బీజేపీ ఐటి సెల్ తన ఫోన్ నెంబర్ ను లీక్ చేసిందని.

 Bjp Narayanan Responded Hero Siddharth Allegations-TeluguStop.com

తనకు ఫోన్ చేసి చంపేస్తామని.కుటుంబ సభ్యులపై అత్యాచారం చేస్తామని బెదిరిస్తున్నారని కోలీవుడ్ హీరో సిద్ధార్థ్ వెల్లడించిన విషయం తెలిసిందే.

అయితే ఈ విషయంపై స్పందించారు తమిళనాడు బీజేపీ అధికార ప్రతినిధి నారాయణన్ తిరుపతి.సిద్ధార్థ్ కు బెదిరింపుల్లో నిజం లేదని అన్నారు.

 Bjp Narayanan Responded Hero Siddharth Allegations-సిద్ధార్థ్ ఆరోపణల్లో నిజం లేదు..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సిద్ధార్థ్ అదే పనిగా ప్రధానిపై విమర్శలు చేస్తున్నారని.ఈ అంశంపై సిద్ధార్థ్ పై తాను ఫిర్యాదు చేశానని నారాయణన్ అన్నారు.

ఆ కేస్ కోర్ట్ లో ఉందని చెప్పారు.ప్రధానమంత్రి, హోం మంత్రి, ముఖ్యమంత్రిల పై ఇష్టం వచ్చినట్టుగా వ్యాఖ్యలు చేసి అపరాధి అయ్యాడని అన్నారు నారాయణన్ తిరుపతి.

అయితే ఈ విషయంపై తమిళనాడు బీజేపీ ఐటీ సెల్ అధిపతి నిర్మల్ కుమార్ కూడా సిద్ధార్థ్ కు వస్తున్న బెదిరింపులకు తమకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు.సిద్ధార్థ్ లాంటి వాళ్లు చాలామంది ఉంటారని అలాంటి వారిని పట్టించుకోవద్దని బీజేపీ శ్రేణులను విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు నిర్మల్ కుమార్.

అయితే సిద్ధార్థ్ ప్రధాని టార్గెట్ చేస్తూ చేసిన కామెంట్స్ పై ప్రజలు బాగానే స్పందిస్తున్నారు.ప్రస్తుతం కరోనా క్రైసిస్ టైం లో వ్యాక్సిన్, ఆక్సిజన్ వంటి విషయాల గురించి సిద్ధార్థ్ బీజేపీని టార్గెట్ చెస్తూ కామెంట్స్ చేశారు.

#Siddharth #Narayanan #Responded #Allegations #Hero

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు