నాగార్జున సాగర్ తీర్పుతో బీజేపీ ఆ విషయంలో పునరాలోచనలో పడిందా?

తెలంగాణలో జరిగిన చివరి ఉపఎన్నిక నాగార్జున సాగర్ .దుబ్బాక ఉప ఎన్నిక నుండి మొదలుకొని గ్రేటర్ ఎన్నికలు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఇలా నాగార్జున సాగర్ ఉప ఎన్నిక జరిగిన విషయం తెలిసిందే.

 Bjp Nagarjuna Sagar By Elections Results-TeluguStop.com

అయితే ఇప్పటి వరకు జరిగిన ఉపఎన్నికలో ఒక్క దుబ్బాక ఉప ఎన్నిక మినహా, గ్రేటర్ లో కొద్దిగా సత్తా చాటినా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో బీజేపీ ఘోరాతి ఘోర పరాజయం చవి చూసిన విషయం తెలిసిందే.అయితే నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే.

అయితే ఈ ఎన్నికలో బీజేపీ అభ్యర్థి డిపాజిట్ కూడా దక్కించుకోలేక పోయింది.అయితే ఈ ఎన్నిక ఫలితాన్ని బట్టి బీజేపీ పునరాలోచనలో పడింది.

 Bjp Nagarjuna Sagar By Elections Results-నాగార్జున సాగర్ తీర్పుతో బీజేపీ ఆ విషయంలో పునరాలోచనలో పడిందా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రభుత్వాన్ని పెద్ద ఎత్తున విమర్శించడంలో దృష్టి పెట్టిన బీజేపీ ఈ ఎన్నికలో నేల విడిచి సాము చేసిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.అయితే కార్యకర్తల నిర్మాణంపై దృష్టి పెట్టని బీజేపీ డైరెక్ట్ గా ఎన్నికల్లో పోటీ చేయడం మీద దృష్టి పెట్టడంతో ఈ తరహా ఫలితాలు ఎదురవుతున్నాయని బీజేపీ భావిస్తున్నట్టు సమాచారం.

అయితే ఈ తీర్పుతో బీజేపీ స్వీయాభివృద్ధిపై దృష్టి పెడితే క్షేత్ర స్థాయిలో కార్యకర్తలు ప్రభుత్వంపై పోరాటం చేస్తే బీజేపీకి కార్యకర్తల బలం పెరుగుతుందని, తద్వారా అధికారపక్షానికి ప్రత్యామ్నాయంగా ఎదగవచ్చని, కాని ప్రభుత్వాన్ని విమర్శించడం మీద దృష్టి పెడితే బీజేపీ ఎదుగుదల కష్టమనే భావన వ్యక్తమవుతోంది.

#Bandi Sanjay #NagarjunaSagar #NagarjunaSagar #BJPLost #Elections

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు