బురదలో కూర్చుని శంఖం ఊదితే `కరోనా` రాదంటున్న బీజేపీ ఎంపీ!

క‌రోనా వైర‌స్‌.ఎప్పుడు ఏ రూపంలో వ‌చ్చి ఎటాక్ చేస్తుందో ఎవ్వ‌రికీ అర్థం కావ‌డం లేదు.

చైనాలో వూహాన్ న‌గ‌రంలో పుట్టుకొచ్చిన ఈ ప్రాణాంత‌క వైర‌స్‌.అన‌తి కాలంలోనే ప్ర‌పంచ‌దేశాలు వ్యాపించింది.

రోజులు త‌ర‌బ‌డి లాక్‌డౌన్ విధించినా.క‌రోనా మాత్రం అదుపులోకి రాలేదు.

దీంతో దేశాల‌న్నీ అన్‌లాక్ ప్ర‌క్రియ ప్రారంభించాయి.ఈ క్ర‌మంలోనే రోజురోజుకు క‌రోనా పాజిటివ్ కేసులు, మ‌ర‌ణాలు భారీ స్థాయిలో పెరుగుతున్నాయి.

Advertisement

ఇప్ప‌టికే ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసులు ఏడు ల‌క్ష‌ల మించిపోగా.పాజిటివ్ కేసుల సంఖ్య రెండు కోట్లు దాటేసింది.

అయితే క‌రోనా వేగంగా విజృంభిస్తున్న వేళ బీజేపీ నేతలు ఇస్తున్న సలహాలు, సూచనలు అభాసుపాలవుతున్నాయి.ఇటీవ‌ల ఆవు పంచకంతో కరోనా నయమవుతుందని, అప్పడాలు తింటే కరోనా నుంచి ర‌క్ష‌ణ పొందొచ్చ‌ని పలువురు బీజేపీ నేతలు పేర్కొన్న సంగ‌తి తెలిసిందే.

అయితే తాజాగా రాజస్థాన్ కు చెందిన బీజేపీ ఎంపీ సుఖ్ బీర్ సింగ్ జౌనపురియా కూడా తనవంతుగా ఓ సలహా ఇచ్చి నవ్వులపాల‌య్యారు.ఇంత‌కీ ఆయ‌న స‌ల‌హా ఏంటీ అంటే.బురదలో కూర్చుని శంఖం ఊదితే కరోనా రాదంటున్నారు.

ఇలా చేయ‌డం వ‌ల్ల ఇమ్యూనిటీ పెరుగుతుందని, తద్వారా కరోనాపై పోరాడే శక్తి వస్తుందని వ్యాఖ్యానించారు.ఇలా చెప్ప‌డ‌మే కాకుండా ఆయన స్వయంగా బురదలో కూర్చుని శంఖం ఊది అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్12, గురువారం2024
పవన్ కు కేంద్ర మంత్రి పదవి ?  నాగబాబుకు అందుకేనా ఛాన్స్ ? 

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎంపీ సుఖ్ బీర్ సింగ్ వ్యాఖ్య‌లు తెగ వైర‌ల్ అవుతున్నాయి.కాగా, గతంలోనూ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు ఖ్ బీర్ సింగ్.

Advertisement

శ‌రీరానికి బురద పూసుకుని యోగా చేస్తే అన్ని వ్యాధులు నయమవుతాయని గ‌తంలో చెప్పుకొచ్చారు.

తాజా వార్తలు