సీ ఓట‌ర్ స‌ర్వేలో బీజేపీకి ఎంపీ సీట్లు పెరుగుతాయంట‌.. కాంగ్రెస్, టీఆర్ ఎస్ కు న‌ష్టం..!

తెలంగాణ రాజ‌కీయాల్లో అప్పుడే ఎన్నిక‌ల వేడి క‌నిపిస్తోంది.ఎన్నిక‌ల‌కు ఇంకా చాలా స‌మ‌యం ఉన్నా కూడా అన్ని పార్టీలు వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపే ల‌క్ష్యంగా పావులు క‌దుపుతున్నాయి.

 Bjp Mp Seats To Increase In Sea Voter Survey Congress Trs Lose , Bjp , Trs , C-TeluguStop.com

అయితే ఇప్పుడు దేశంలో జ‌రుగుతున్న ఐదు రాష్ట్రాల ఉప ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఎన్నో స‌ర్వేలు తెర మీద‌కు వ‌స్తున్నాయి.ఇక ఇందులో భాగంగానే సీ ఓట‌ర్ స‌ర్వే ఒక‌టి బాగా వైర‌ల్ అవుతోంది.

ఇందులో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వ‌స్తాయ‌నే అంశం మీద తెలంగాణ‌లో కూడా ఒక స‌ర్వే నిర్వ‌హించారు.అయితే ఇందులో బీజేపీకి ఎంపీ సీట్లు పెరుగుతాయ‌ని వ‌చ్చాయి.

ఇప్పుడు బీజేపీ రాష్ట్రంలో బ‌లంగా పోరాడుతోంది కాబ‌ట్టి క‌చ్చితంగా ఆ పార్టీకి ఆరు ఎంపీ సీట్లు వ‌స్తాయ‌ని ఇండియా టుడే సీ ఓట‌ర్ మూడ్ ఆఫ్ ది నేష‌న్ పేరుతో నిర్వ‌హించిన స‌ర్వేలో ఇలాంటి నిజాలు బ‌య‌ట ప‌డ్డాయి.అయితే బీజేపీకి ఇప్పుడు నాలుగు సీట్లు ఉన్నాయి.

మ‌రి ఆ రెండు సీట్లు ఏ పార్టీ నుంచి లాక్కునే ఛాన్స్ ఉంది అంటే.ఇందులో ఒక‌టి కాంగ్రెస్ నుంచి అయితే మ‌రొక‌టి టీఆర్ ఎస్ నుంచి అని తెలుస్తోంది.

అంటే దాదాపు 50శాతం సీట్లు బీజేపీకి పెరుగుతాయ‌న్న మాట‌.అంటే క‌చ్చితంగా బీజేపీకి గ్రాఫ్ పెరుగుతుంద‌న్న మాట‌.

అంటే ఎటు చూసినా కూడా టీఆర్ ఎస్‌కు, కాంగ్రెస్‌కు బీజేపీ గండి కొడుతోంద‌న్న మాట‌.దీంతో కాంగ్రెస్‌ ఎంపీలు రెండు అయితే.టీఆర్ ఎస్ సీట్లు తొమ్మిది నుంచి ఎనిమిదికి త‌గ్గుతాయ‌న్న మాట‌.అంటే ఫెడ‌ర‌ల్ ఫ్రంటు వైపు అడుగులు వేస్తున్న కేసీఆర్‌కు ఇది పెద్ద షాక్ అనే చెప్పాలి.

ఎందుకంటే ఎంపీ సీట్లు త‌గ్గిపోతే ఆయ‌న‌కు అంత విలువ ఉండ‌దు.మ‌రి ఈ విష‌యంలో కేసీఆర్ ఎలా బీజేపీని ఎదుర్కుంటారో అన్న‌ది మాత్రం వేచి చూడాలి.బీజేపీ మాత్రం ఎన్నిక‌లు ఎంత ఆల‌స్యంగా వ‌స్తే అంత మంచిది అన్న‌ట్టు చూస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube