జనసేన విలీనంపై బీజేపీ ఎంపీ స్పందన ఇదే

మొదటి నుంచి తాను బీజేపీతోనే ఉన్నాను అంటూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడాన్ని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు స్పందించారు.జనసేన పార్టీని బీజేపీలో విలీనం చేయాల్సిందిగా ఎన్నికల ముందే అడిగామని కానీ అప్పుడు పవన్ ఒప్పుకోలేదని, కానీ ఇప్పుడు విలీనం చేసేందుకు పవన్ అంగీకరిస్తే స్వాగతిస్తామంటూ పవన్ వ్యాఖ్యానించారు.

 Bjp Mp Gvl Respond To Pavan Kalyan Coments-TeluguStop.com

బీజేపీ విధానాలు నచ్చి తమతో కలిసి పనిచేయాలనుకుంటే తాము ఎప్పుడూ సిద్ధంగా ఉంటామన్నారు.అయితే ఇది పొత్తులకు సరైన సమయం కాదని, తమ భుజాలపై నుంచి ఆరు అడుగుల బుల్లెట్‌ను వేరే వారి పైకి సంధించాలనుకుంటే పొరపాటేనని ఆయన వ్యాఖ్యానించారు.

బీజేపీ పెద్దలంటే తనకు ఎంతో గౌరవం అంటూ పవన్ తో పాటు బీజేపీ నాయకులు చెబుతున్నారని అటువంటప్పుడు తమతో కలిసి పనిచేస్తే ప్రాంతీయ పార్టీలను తాము స్వాగతిస్తామన్నారు.పవన్ విలీన ప్రతిపాదనతో వస్తే ఆహ్వానిస్తామని జీవీఎల్ చెప్పుకొచ్చారు.

తాజగా హిందూ రాజకీయ నాయకుల కారణంగానే మాత ఘర్షణలు చెలరేగుతున్నాయనే వార్తలపైనా జీవీఎల్ స్పందించారు.హిందువులే మత ఘర్షణలకు పాలపడుతున్నారనడం సరికాదంటూ పవన్ వ్యాఖ్యలను జీవీఎల్ ఖండించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube