శ్రీరాముడు మా ముత్తాత అంటున్న జైపూర్ రాజకుమారి! ఆసక్తి పెంచుతున్న వాఖ్యలు  

Bjp Mp Diya Kumari Says Her Family Descended From Lord Ram-

ప్రస్తుతం అయోధ్యలో రామ మందిరం ఇష్యూ పెద్ద హాట్ టాపిక్ అయ్యి కూర్చుంది.అక్కడ ఒకప్పుడు రామ మందిరం ఉండేది అని, అయోధ్య శ్రీరాముడు జన్మస్థలం అని హిందుత్వ వాదులు, బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాదిస్తుంది.

Bjp Mp Diya Kumari Says Her Family Descended From Lord Ram--BJP MP Diya Kumari Says Her Family Descended From Lord Ram-

దీని కోసం దశాబ్దాలుగా అయోధ్య రామ మందిరం నిర్మాణం కోసం హిందుత్వ సంస్థలు పోరాటం చేస్తున్నాయి.అలాగే అయోధ్యలో మసీదు కోసం ముస్లింలు కూడా పోరాడుతున్నారు.అయితే వీరిద్దరికి సుప్రీం కోర్ట్ సర్ది చెప్పలేక కేసుని సంవత్సరాలుగా పొడిగిస్తూ వస్తుంది.

అయితే అయోధ్య రాముడు జన్మస్థలం అని చెప్పడానికి ఆధారాలు ఏవైనా ఉన్నాయా, వారి పూర్వీకులు ఎవరైనా ఉన్నా ఉంటే చెప్పండి అంటూ సుప్రీం కోర్టు ప్రశ్నించింది.ఇదిలా తాజాగా జైపూర్ రాజకుమారి, బీజేపీ ఎంపీ దియా కుమారి చేసిన వాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.

తాము రాముడి కుమారుడు కుశుడు వంశానికి చెందిన వారమని, శ్రీరాముడు తమకి ముత్తాత అవుతారని చెప్పుకొచ్చింది.రాముడి వంశస్థులు ప్రపంచం అ‍తటా వ్యాపించి ఉన్నారని, అయోధ్య వివాదం వీలైనంత తొందరగా పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నామన్నారు.

రాముడి వారసులు ఉన్నారా అని సుప్రీంకోర్టు అడిగింది.వారు ప్రపంచమంతా వ్యాపించి ఉన్నారు.అంతెందుకు మా వంశం కూడా కుశుడు నుంచి వచ్చింది.రాజ కుటుంబం వద్దనున్న మను చరిత్ర, జన్యుశాస్త్రం ఆధారంగా ఈ విషయం చెబుతున్నాను.కావాలంటే నా దగ్గర ఉన్న పత్రాల ద్వారా ఈ విషయాన్ని నిరూపిస్తాను అంటూ సెలవిచ్చింది.

ఇప్పుడు ఈమె మాటలు రాజకీయ వర్గాలలో ఆసక్తికరంగా మారి.దియా కుమారి హాట్ టాపిక్ అయ్యింది.