అలాంటప్పుడు కేంద్రం ఉంది ఎందుకు?

ఏపీ ప్రజలు రాజధాని విషయమై తీవ్ర గందరగోళ పరిస్థితుల్లో ఉన్నారు.రాజధాని వ్యవహారం అంతా అస్థవ్యస్థంగా ఉన్న కారణంగా రాష్ట్రంలో కొత్త పరిశ్రమల ఏర్పాటుకు ఏ ఒక్క కంపెనీ కూడా ముందుకు రావడం లేదు.

 Bjp Mp Comments On Ap Capitals-TeluguStop.com

ఇదే సమయంలో పెద్ద ఎత్తున కంపెనీలు తిరిగి వెళ్తాయనే ప్రచారం జరుగుతుంది.ఇటీవలే కియా కంపెనీ తమిళనాడుకు షిఫ్ట్‌ అయ్యే ఆలోచనలో ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి.

అది నిజం కాదని ప్రభుత్వం చెబుతున్నా కూడా కంపెనీకి మాత్రం ఆ ఆలోచన ఉందేమో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.ఇలాంటి నేపథ్యంలో ఏపీ ప్రజలు రాజధాని విషయమై కేంద్రం అయినా స్పష్టత ఇవ్వాలంటూ కోరుతున్నారు.

ఇటీవల అమరావతి రైతులు ఢల్లీిలో రాజధాని విషయమై కేంద్ర పెద్దల వద్ద మొర పెట్టుకునేందుకు వెళ్లారు.అక్కడ వారికి చాయ్‌ బిస్కట్స్‌ తప్ప మరేమీ దక్కలేదట.ఢల్లీి పెద్దలు ఏ ఒక్కరు కూడా ఏపీ రాజధాని విషయమై స్పందించేందుకు ఆసక్తి చూపడం లేదట.అసలు అది తమ పరిధిలోకి వచ్చేది కాదన్నట్లుగా మాట్లాడారట.

తాజాగా బీజేపీ ఎంపీ మాట్లాడుతూ రాజధాని అంశం అసలు కేంద్రం పరిధిలోకి రాదు.రాష్ట్రం అన్ని విధాలుగా మంచి నిర్ణయం తీసుకోవాలంటూ ఆయన సూచించాడు.

ఆయన వ్యాఖ్యలపై ఏపీ ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.రాష్ట్ర సమస్య కేంద్రం పరిధిలోకి రాదంటూ వ్యాఖ్యలు చేయడం ఏంటీ? అలా అయితే రాష్ట్రలపై కేంద్రం అజమాయిషీ ఎందుకు అంటూ ఏపీ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube