స్పీడు తగ్గించిన బండి సంజయ్... అసలు కారణమిదేనా

తెలంగాణ రాజకీయాలు రోజు రోజుకు పెద్ద ఎత్తున అధికార, ప్రతిపక్ష పార్టీల మాటల తూటాలతో హాట్ హాట్ గా మారుతున్న పరిస్థితి ఉంది.టీఆర్ఎస్ తరువాత ప్రత్యామ్నాయ పార్టీగా మారాలనే ఉద్దేశ్యంతో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ పెద్ద ఎత్తున క్షేత్ర స్థాయిలో టీఆర్ఎస్ పార్టీ పట్ల వ్యతిరేకతను పెంచుతూ బీజేపీ మరింతగా బలపడటానికి ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది.

 Bjp Mp Bandi Sanjay Political Strategies Against Kcr Details, Bandi Sanjay, Bjp-TeluguStop.com

అయితే కెసీఆర్ ప్రెస్ మీట్ తరువాత బండి సంజయ్ తన స్పీడును తగ్గించిన విషయం తెలిసిందే.

అయితే అందుకు ప్రధాన కారణం ఇంకా సార్వత్రిక ఎన్నికలకు రెండున్నర సంవత్సరాలు మాత్రమే ఉండటంతో ఇక స్థానికంగా నియోజకవర్గాల వారీగా బీజేపీని బలోపేతం చేసే దిశగా పార్టీలో అంతర్గతంగా చాలా సీరియస్ గా అడుగులు ముందుకు పడుతున్న తరుణంలోనే కొంత సైలెంట్ గా ఉన్న పరిస్థితి ఉంది.

బీజేపీలో చాలా కీలక నేతలు ముందుకు వస్తున్నా ప్రజల్లో గుర్తించబడ్డ నేతలు చాలా తక్కువగా ఉన్నారు.అంతేకాక మతం ఆధారంగా రాజకీయాలు చేసే సంస్కృతి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో లేదు, తెలంగాణలో గత రెండు టీఆర్ఎస్ ప్రభుత్వ సమయంలో కూడా లేదు.

బీజేపీ రెండు, మూడు సీట్లలో గెలిచిన తరువాత ఇక పెద్ద ఎత్తున మతం ఆధారంగా రాజకీయ విధానాన్ని తెలంగాణలో మొదలుపెడుతోంది.

అయితే దీనిపై ఇప్పటికైతే కెసీఆర్ స్పందించకున్నా సరైన సమయంలో తనకు అనుకూలంగా మార్చుకునే అవకాశం వందకు వంద శాతం ఉంది.అయితే క్షేత్ర స్థాయిలో బీజేపీ క్యాడర్ ఉన్నా వారు ప్రస్తుత కాస్ట్లీ రాజకీయాల్లో ఎంత మేరకు నిలదొక్కుకుంటారు అనేది కొంత ప్రశ్నార్థకమైన విషయం.ఒకవేళ బీజేపీ గాలి వీస్తేనే అది సాధ్యమవుతుంది.

అయితే రాజకీయ వ్యూహాలలో ఆరితేరిన కెసీఆర్ బీజేపీ ఎత్తులకు పై ఎత్తులు వేస్తాడనడంలో ఎటువంటి సందేహం లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube