ఆ ఎమ్మెల్యేపై పోటీకి సై అంటున్న అర్వింద్.. సీరియస్ సవాల్..

బీజేపీ ఎంపీ అర్వింద్ కారు దాడి వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పుట్టించింది.ఉన్నట్టుండి ఒక్క సారిగా ఎంపీ, బీజేపీ కార్యకర్తలపై దాడి జరగడంతో కమలనాథులు సీరియస్ అవుతున్నారు.

 Bjp Mp Aravind Serious Challenge Against Armur Mla Jeevan Reddy Details, , Mp Aravind, Jeevan, Bjp Mp Aravind, Serious Challenge ,armur Mla Jeevan Reddy, Mp Aravind Convoy, Trs Leaders, Cm Kcr, Elections, Trs Party-TeluguStop.com

దాడికి సంబంధించిన వీడియోలను చూసి షాక్ అవుతున్నారు.ఇంతలా దాడి జరుగుతుంటే పోలీసులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అంతకంతకూ బదులు తీర్చుకుంటామంటూ సీరియస్ అవుతున్నారు.ఇక తనపై దాడి చేసిన ఘటనపై ఎంపీ అర్వింద్ తీవ్రంగా స్పందించారు.

 Bjp Mp Aravind Serious Challenge Against Armur Mla Jeevan Reddy Details, , Mp Aravind, Jeevan, Bjp Mp Aravind, Serious Challenge ,armur Mla Jeevan Reddy, Mp Aravind Convoy, Trs Leaders, Cm Kcr, Elections, Trs Party-ఆ ఎమ్మెల్యేపై పోటీకి సై అంటున్న అర్వింద్.. సీరియస్ సవాల్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇదొక పిరికి పంద చర్యగా చెప్పుకొచ్చారు.

తమ కార్యకర్తలపై దాడి చేయించింది ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అని ఆరోపించారు.

వచ్చే ఎన్నికల్లో తాను ఆర్మూర్ నుంచి పోటీ చేస్తానన్నారు.జీవన్ రెడ్డిపై 50 వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తానని సవాల్ విసిరారు.

జీవన్ రెడ్డిని ఓడించకపోతే తన పేరు అర్విందే కాదని స్పష్టం చేశారు.టీఆర్ఎస్‌ను రాజకీయంగా ఎదుర్కొంటామని తెలిపారు.

దాడి వెనక రాష్ట్ర ప్రభుత్వం కుట్ర ఉందని ఆరోపించారు.మరి ఎంపీ అర్వింద్ చేసిన సవాల్ రాజకీయంగా ఎలాంటి మార్పులకు కారణమవుతుందో చూడాలి.

మరో వైపు ఈ అంశంపై టీఆర్ఎస్ నాయకులు సైతం స్పందించారు.దాడికి తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.కానీ బీజేపీ నాయకులు మాత్రం ఈ దాడికి పాల్పడింది టీఆర్ఎస్ శ్రేణులేనని ఆరోపిస్తున్నారు.మరి దీనిపై ఇరు పార్టీల పెద్దలు ఏ విధంగా స్పందిస్తోరో చూడాలి.మొన్నటి వరకు కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం చెట్టాపట్టాలేసుకుని తిరిగింది.ఆ టైంలోనూ రాష్ట్ర బీజేపీ నేతలపై విమర్శలు చేస్తూనే వచ్చింది.

ప్రస్తుతం కేంద్రంతో తాడో పేడో తేల్చుకునేందుకు సీఎం సిద్ధం కావడంతో కొత్త రాజకీయాలకు తెరలేపినట్టయింది.మరి వచ్చే ఎన్నికల ముందు ఎలాంటి పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయో వేచిచూడాలి.

Bjp Mp Aravind Serious Challenge Against Armur Mla Jeevan Reddy Details, , Mp Aravind, Jeevan, Bjp Mp Aravind, Serious Challenge ,armur Mla Jeevan Reddy, Mp Aravind Convoy, Trs Leaders, Cm Kcr, Elections, Trs Party - Telugu Armurmla, Bjp Mp Aravind, Cm Kcr, Jeevan, Mp Aravind, Trs

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube