కేసిఆర్, కేటీఆర్ ఫ్లెక్సీలు కనిపిస్తే చించుడే ?  

తెలంగాణ బిజెపి నేతలకు కేసిఆర్, కేటీఆర్ మరి టార్గెట్ గా మారిపోయారు.ఏదో రకంగా టిఆర్ఎస్ ను ఇరుకున పెట్టి,  గ్రేటర్ పీఠాన్ని తమ ఖాతాలో వేసుకునేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు.

TeluguStop.com - Bjp Mp Aravind Sensational Comments On Kcr Ktr Hoarding

ఈ క్రమంలో సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.దీంతో అవి కాస్తా వివాదాస్పదం అవుతున్నాయి.

తాజాగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్  కేసిఆర్, కేటీఆర్ లను ఉద్దేశించి ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.దుబ్బాక ఉప ఎన్నికల దగ్గర నుంచి అరవింద్ పూర్తిగా కేసిఆర్, కేటీఆర్ ను బాగా టార్గెట్ చేసుకున్నట్లుగా వ్యవహరిస్తున్నారు.  ఈ క్రమంలోనే గ్రేటర్ పరిధిలో భారీ ఎత్తున ఏర్పాటు చేసిన కేసీఆర్,  కేటీఆర్ ఫ్లెక్సీల వ్యవహారంపై అరవింద్ ఘాటుగా స్పందించారు.” జిహెచ్ఎంసి నీ అయ్య సొత్తు కాదు కేటీఆర్.నీవు ఒక మున్సిపల్ మంత్రివి.నీ ఇష్టం సారంగా ఏజెన్సీలకు రాత్రికి రాత్రి హోర్డింగ్ పెట్టేందుకు ఆర్డర్లు ఇస్తే చూస్తూ ఊరుకోవాలా అంటూ అరవింద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

TeluguStop.com - కేసిఆర్, కేటీఆర్ ఫ్లెక్సీలు కనిపిస్తే చించుడే -General-Telugu-Telugu Tollywood Photo Image

ఈ వ్యవహారంపై కార్యకర్తలతో అరవింద్ మాట్లాడుతూ, స్తంభాలకు,  రోడ్ల పైన, టాయిలెట్ ల మీద కేసీఆర్,  కేటీఆర్ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారని,  ఇటువంటివి ఎక్కడ కనిపిస్తే అక్కడ వాటిని చించివేయలి అని పిలుపునిచ్చారు.కేవలం మాటలతో సరిపెట్టకుండా చేసి చూపించారు.

కెబిఆర్ పార్క్ వద్ద ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీని దగ్గరుండి మరీ అరవింద్ చింపి వేయించారు.దీంతో ఇప్పుడు టిఆర్ఎస్,  బిజెపిల మధ్య ఫ్లెక్సీల వార్ జరిగే అవకాశం కల్పిస్తున్నట్లు గా రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

అయితే ఫ్లెక్సీల వ్యవహారంపై బిజెపి ఇంతగా దృష్టి పెట్టడానికి కారణం, గ్రేటర్ పరిధిలో ఇంకెవరికీ అవకాశం దక్కకుండా , టిఆర్ఎస్ అన్ని హోర్డింగ్ లను తమ ఆధీనంలో కి వచ్చే విధంగా చేసుకున్నారని, దీంతో మిగిలిన పార్టీలకు,  నాయకులకు ఆ అవకాశం దొరకడం లేదని , ఆ ఆగ్రహంతోనే అరవింద్ ఈ వ్యవహారంపై దృష్టి పెట్టి ఈ స్థాయిలో ఫైర్ అవుతున్నారని సమాచారం.ఇక టిఆర్ఎస్ కు సంబంధించి ఏ చిన్న అవకాశం దొరికినా , దానిని వదిలిపెట్టకుండా ఘాటుగా తమ తడాఖా చూపించి, గ్రేటర్ పరిధిలో తమ సత్తా చాటుకోవాలనే ఉద్దేశంలో బిజెపి ఉన్నట్లుగా కనిపిస్తోంది.

#GHMC #Hordings #Flexy #Telangana

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Bjp Mp Aravind Sensational Comments On Kcr Ktr Hoarding Related Telugu News,Photos/Pics,Images..