వ్యూహాత్మకంగా కదులుతున్న బీజేపీ.. అసలు టార్గెట్ ఇదేనా?

Bjp Moving Strategically Is This The Real Target

తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు ఆసక్తికరంగా మారుతున్న పరిస్థితి ఉంది.అయితే తెలంగాణ బీజేపీ ఒక్కసారిగా టీఆర్ఎస్ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున దండెత్తిందని చెప్పవచ్చు.

 Bjp Moving Strategically Is This The Real Target-TeluguStop.com

ప్రస్తుతం వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అధికారం కైవసమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న పరిస్థితి ఉంది.అయితే తెలంగాణ ప్రభుత్వ వైఫ్యల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళడమే లక్ష్యంగా చాలా వ్యూహాత్మకంగా కదులుతున్న పరిస్థితి ఉంది.

అందులో భాగంగా ప్రభుత్వ వైఫల్యాలే పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఇక వచ్చే రెండు సంవత్సరాలలో ప్రభుత్వం ఎన్ని మంచి కార్యక్రమాలు చేపట్టినా బీజేపీ వ్యూహాత్మకంగా సృష్టించిన వ్యతిరేకతతో ప్రజల్లోకి వెళ్ళకుండా బీజేపీ పావులు కదు పుతోంది.

 Bjp Moving Strategically Is This The Real Target-వ్యూహాత్మకంగా కదులుతున్న బీజేపీ.. అసలు టార్గెట్ ఇదేనా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com
Telugu @bjp4telangana, @cm_kcr, Bandi Sanjay, Trs-Political

అయితే టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఇంతలా జరుగుతున్నా కెసీఆర్ నుండి కానీ టీఆర్ఎస్ నుండి కానీ ఎటువంటి స్పందన రావడం లేదు.దీంతో ప్రతిపక్షాలు ఒక్కసారిగా అంతర్మథనంలో పడ్డాయి.అయితే కెసీఆర్ మౌనం చాలా ప్రమాదకరం.అందుకు చక్కని ఉదాహరణ ఆర్టీసీ ఉద్యమం.కెసీఆర్ కు వ్యతిరేకంగా ఎంత పెద్ద ఉద్యమం జరిగిందో మనం చూశాం.కానీ ఆ తరువాత ఆర్టీసీ ఉద్యోగులను అందరినీ ఒక్క నిర్ణయంతో తన వైపు తిప్పుకున్నారో మనం చూశాం.

అయితే ముఖ్యమంత్రి కెసీఆర్ కు ఉన్న రాజకీయ అనుభవంతో పోలిస్తే ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ ఎదుర్కొంటున్నది పెద్ద సమస్య కాదు.అందుకే ప్రతిపక్షాల విమర్శలపై ఎప్పటికప్పుడు పెద్దగా స్పందించకున్నా ఒకే సారి తగిన వ్యూహంతో ముందుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఏది ఏమైనా బీజేపీ వ్యూహాత్మకంగా కదులుతూ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అధికారం కైవసమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది.అయితే బీజేపీకి సరైన అభ్యర్థులు లేరన్నది సుస్పష్టం.

మరి బీజేపీ రానున్న రోజుల్లో ఎటువంటి అడుగులు వేస్తుందనేది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిగా మారింది.

#Trs #@BJP4Telangana #@CM_KCR #Bandi Sanjay

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube