ప్రత్యేక హోదాపై జగన్ ఆశలు పెట్టుకోవద్దు అని చెప్పిన ఏపీ బీజేపీ నేత!  

ప్రత్యేక హోదా విషయం జగన్ మరిచిపోవాల్సిందే అంటున్న ఎమ్మెల్సీ మాధవ్. .

Bjp Mlc Madav Clarity To Jagan On Special Status-bjp Mlc Madav Clarity,jagan,special Status,tdp,ysrcp

ఏపీలో తాజా ఎన్నికలలో ఎదురులేకుండా ఏకంగా151 స్థానాలలో గెలిచి అధికారంలోకి వచ్చిన వైసీపీ పార్టీ అధినేత ఓ వైపు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారంకి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నాడు. ఒక ఏకంగా 23 ఎంపీ స్థానాలని కైవసం చేసుకున్న జగన్ ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో తన పోరాటం ఆగదని, కేంద్రంలో పోరాడి ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురావడంలో వైసీపీ ఎంపీలు సిద్ధంగా ఉంటారని చెప్పుకొచ్చారు. ఇక ప్రత్యేక హోదా అనేది ముగిసిపోయిన అధ్యాయం అంటూ చెప్పేసిన బీజేపీ పార్టీ నేతలకి, తాను ప్రత్యేక హోదా అంశపై కట్టుబడి ఉన్నానని జగన్ చెప్పడంతో బీజేపీని అంత ఈజీగా వదలను అని గట్టిగా చెప్పినట్లు అయ్యింది. .

ప్రత్యేక హోదాపై జగన్ ఆశలు పెట్టుకోవద్దు అని చెప్పిన ఏపీ బీజేపీ నేత! -BJP MLC Madav Clarity To Jagan On Special Status

ఇదిలా ఉంటే జగన్ ఓ వైపు ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తాం అని చెప్పగానే ఏపీ బీజేపీ నేత ఎమ్మెల్సీ మాధవ్ మీడియా ముందుకి వచ్చి ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశమే లేదని తేల్చి చెప్పేశారు. ప్రత్యేక హోదా విషయాన్ని జగన్ మరిచిపోయి పరిపాలన మీద ద్రుష్టి పెట్టాలని, కేంద్రం కావాల్సిన సాయం మాత్రమే అందిస్తుంది అని చెప్పుకొచ్చారు.

అలాగే వైసీపీ గెలుపుకి పరోక్షంగా బీజేపీ, జనసేన కారణం అని కూడా మాధవ్ చెప్పడం విశేషం. మాధవ్ మాటల బట్టి జగన్ ప్రత్యేక హోదా గురించి పోరాడిన ప్రయోజనం ఉండదని ఓ విధంగా స్పష్టం అవుతుంది అని చెప్పాలి. మరి ఇప్పుడు జగన్ ఏపీ హోదా విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు అనేది చూడాలి.