“మే 15” న టీడీపీ లో ప్రకంపనలే... “విష్ణు కుమార్ రాజు ” షాకింగ్ కామెంట్స్       2018-04-27   23:02:16  IST  Bhanu C

ఏపీలో ప్రధానంగా ఉన్న పార్టీలు రెండే రెండు ఒకటి అధికార పక్షం అయిన తెలుగుదేశం మరొకటి పతిపక్ష పార్టీ అయిన వైసీపి..అయితే మిగిలిన పార్టీలు జనసేన ,బిజేపీ లు ఉన్నా సరే ఎదో ఉన్నాయి అన్నట్టుగా ఉన్నాయి అంతే..ఎన్నికల్లో గట్టి పోటీ మాత్రం ఈ రెండు ప్రధాన పార్టీల మధ్యనే జరుగుతుంది..అయితే టీడీపీ ని ఓడించాలనే కసి వైసీపి వాళ్ళకంటే కూడా బీజేపి పార్టీ నేతలకే అధికంగా ఉంటోంది..గత కొంతకాలంగా వైసీపి , బీజేపి కలిసి టీడీపీని టార్గెట్ చేయడం చూస్తూనే ఉన్నాము అంతేకాదు ఇరు పార్టీలు తెలుగుదేశం పార్టీ తో మైండ్ గేమ్ ఆడటం కూడా మొదలు పెట్టింది..ఈ క్రమంలోనే బీజేపి ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు సంచలన వ్యాఖలు చేశారు..


పట్టి సీమలో భారీ అవినీతి జరిగిందని ముందు నుంచీ బీజేపి అలోపణలు చేస్తూనే ఉంది దానికి తగ్గట్టుగానే టీడీపి నేతలు వారి విమర్సలని తిప్పి కొడుతూ వస్తున్నారు అయితే విష్ణు కుమార్ రాజు మాట్లాడుతూ ఇప్పటికే పట్టిసీమపై పూర్తీ స్థాయిలో రిపోర్ట్ సిద్దం చేశానని..త్వరలోనే అన్ని విషయాలతో సహా సీబీఐ కి అప్పగిస్తాను తెలుగు దేశం వాళ్ళ కోరిక తీర్చేస్తాను లెక్క తెల్చేస్తాను అంటూ సవాల్ విసిరారు..త్వరలోనే సీబీఐ రంగంలోకి దిగుతుందని హెచ్చరించారు.. మీరు కోరుకుంది కూడా ఇదేగా అంటూ చురకలు అంటించారు..బీజేపి నేత విష్ణు కుమార్ రాజు అయితే ఈ సందర్భంలోనే ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు..దాంతో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నేతల్లో గుబులు రేగుతోంది.

టీడీపి పార్టీ కుటుంభ పార్టీ అని , 2019 లో ఎటువంటి పరిస్థితులో కూడా టీడీపీ అధికారంలోకి రాదనీ తేల్చేశారు.. “మే 15 “ తేదీ లోపుగా టీడీపి లో చాలా మంది నేతలు వైసీపిలోకి వస్తారని సంచలన వ్యఖ్యలు చేశారు..ఈరోజు ఉన్న పరిస్థితులు రేపు ఉండవు..నేను చెప్పింది జరిగి తీరుతుంది అని అన్నారు తను కూడా వెళ్లి జగన్ ని కలుస్తానని అన్నారు..అంతేకాదు టీడీపీ లో ఉన్న ఎంతో మంది కీలక నేతలు ఇప్పటికే జగన తో టచ్ లో ఉన్నారని మరొక బాంబు పేల్చారు విష్ణు..టీడీపీ తో పొత్తు పెట్టుకోవడం వలన కేవలం నాలుగు ఎమ్మెల్యే రెండు ఎంపీ వచ్చాయని టీడీపితో పొత్తు లేకుండా ఉంటే ఆ సమాఖ్య రెట్టింపు అయ్యేదని కామెంట్స్ చేశారు..మొత్తానికి “మే 15 “ డేట్ చెప్పి టీడీపీ లో టెన్షన్ పెంచేశారు విష్ణు కుమార్ రాజు.