రాజాసింగ్ కొత్త వాదన! హిందువులని టార్గెట్ ఫుడ్ లో కెమికల్స్  

Bjp Mla Rajasingh Controversial Comments On Food Products - Telugu Bjp Mla Rajasingh Controversial Comments, Hinduism, Food Products, Secular India

తెలంగాణలో వివాదాస్పద నేతగా ముద్ర పడ్డ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు.కరుడుగట్టిన హిందుత్వ వాదిగా ముద్ర వేసుకున్న అతను హిందువులపై జరిగే దాడులని, అలాగే హిందూ దేవతలకి వ్యతిరేకంగా ఎవరైనా వాఖ్యలు చేస్తే వెంటనే రియాక్ట్ అవుతారు.

Bjp Mla Rajasingh Controversial Comments On Online Food Products

తాజాగా అతను మరో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.ఇవి ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.

హిందువుల సంతతి పెరగకుండా ఇతర దేశాలకి, మతాలకి చెందిన వారి ఫుడ్ ప్రొడక్ట్స్ లో కెమికల్స్‌ కలిపెస్తున్నారని, వీటిని తినడం వలెనే చాలా మంది పిల్లలు పుట్టకపోవడం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.ప్రతి రాష్ట్రంలోనూ హిందువులని లక్ష్యంగా చేసుకొని ఏదో ఒక రూపంలో దాడులు జరుగుతున్నారని అన్నారు.

ఇండియా నుంచి హిందువులని లేకుండా చేయడమే లక్ష్యంగా ఘోరాలు చేస్తున్నారని అన్నారు.అందుకే ప్రతి హిందూ యువకుడు ఒక ఛత్రపతి శివాజీ కావాలని పిలుపునిచ్చారు.వికారాబాద్‌ జిల్లా తాండూరులో నిర్వహించిన ఛత్రపతి శివాజీ జయంతి శోభాయాత్రలో రాజాసింగ్‌ పాల్గొన్నారు.జంక్ ఫుడ్స్ తినడం వలన సంతాన సమస్య ఏర్పడుతుందని డాక్టర్లు కూడా చెబుతున్న నేపధ్యంలో రాజాసింగ్ అన్న ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

తాజా వార్తలు

Bjp Mla Rajasingh Controversial Comments On Food Products-hinduism, Food Products,secular India Related....