అత్యాచారానికి పాల్పడ్డ బీజేపీ ఎమ్మెల్యేకి జీవిత ఖైదు...

దేశంలో కొన్ని కోర్టు తీర్పులు చూస్తుంటే న్యాయం ఇంకా ప్రజల వైపు ఉంటుందని అప్పుడప్పుడు గుర్తొస్తుంది.ఒక్కోసారి ప్రత్యర్థులు తమ అధికార బలంతో కేసు తప్పుదోవ పట్టించాలని చూసినా న్యాయం మాత్రం ఎప్పుడూ నిజం వైపే ఉంటుంది.

 Bjp Mla Kuldip Singh Sengar Bhartiya Janta-TeluguStop.com

 తాజాగా ఓ యువతిపై అత్యాచారయత్నానికి పాల్పడ్డ బిజెపి ఎమ్మెల్యేకి ఢిల్లీ కోర్టు జీవిత ఖైదు విధించింది.

వివరాల్లోకి వెళితే 2017వ సంవత్సరంలో ఓ మైనర్ బాలిక తనకు ఉద్యోగం కల్పించాలని కోరుతూ భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ ఇంటికి వెళ్ళింది.

అయితే ఈ సమయంలో కుల్దీప్ సింగ్ తన అనుచరులతో కలిసి మైనర్ బాలికపై అత్యాచారం చేశారు.దీంతో ఆ బాలిక కుల్దీప్ సింగ్ మరియు తన అనుచరులపై కేసు నమోదు చేసి న్యాయం కోసం కోర్టును ఆశ్రయించింది.

 అయితే అప్పటికే అధికారంలో ఉన్న కుల్దీప్ సింగ్ తన అధికార బలాన్ని ఉపయోగించి కేసును తప్పుదోవ పట్టించడానికి పలు ప్రయత్నాలు చేయడమే కాక, బాధితురాలు విచారణ నిమిత్తం కోర్టుకు వస్తుండగా ఓ గుర్తుతెలియని లారీ తో ఢీ కొట్టి చంపే ప్రయత్నాలు కూడా చేశారని బాధితురాలు ఆరోపిస్తున్నారు.అయితే ఈ ఘటనలో తమ బంధువులు అయినటువంటి ఇద్దరు మహిళలు మృతిచెందగా తమ తరపు న్యాయవాది తీవ్రంగా గాయపడ్డాడు.

ఈ సంఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు విచారణ పత్రాలు సమర్పించగా రెండు రోజుల క్రితమే కుల్దీప్ సింగ్ దోషాన్ని న్యాయస్థానం తేల్చింది.అలాగే ఈ రోజు కుల్దీప్ సింగ్ సింగర్ కు జీవిత ఖైదు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.అంతేగాక 25 లక్షల రూపాయలు జరిమానా కూడా విధించింది.ఈ జరిమానా మొత్తం సొమ్ములో ఘటనలోని బాధితురాలోకి పది లక్షల రూపాయలు ఇవ్వాలని కోర్టు తీర్పు ఇచ్చింది.  అయితే  కుల్దీప్ తో పాటు అత్యాచార అభియోగాలు ఎదుర్కొంటున్న నిందితుడు శశి సింగ్ ని న్యాయస్థానం నిర్దోషిగా తేల్చింది.అయితే ఎన్ని అవాంతరాలు వచ్చినా వదలకుండా తనపై ఇంతటి అఘియిత్యానికి పాల్పడ్డ నిందితుడికి శిక్ష పడేలా చేసిన ఆ యావతిని పలువురు ప్రముఖులు ప్రశంసిస్తున్నారు.

#UnnavIncident #BhartiyaJanta #UnnavCase #UnnavIncident #BJPMla

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు