టీఆర్ఎస్‌లోకి బీజేపీ ఎమ్మెల్యే..!

తెలంగాణలో అధికార టీఆర్ఎస్ బ‌లం రోజు రోజుకు పెరిగిపోతోంది.ఇత‌ర పార్టీల‌కు చెందిన ప్ర‌జాప్ర‌తినిధులు వ‌రుస‌పెట్టి సైకిలెక్కేస్తున్నారు.

 Bjp Mla Joins Trs Party-TeluguStop.com

ఇప్ప‌టికే టీడీపీ అక్క‌డ కూలిపోగా, కాంగ్రెస్ కూడా క‌కావిక‌ల‌మైంది.ఈ క్ర‌మంలోనే ఇప్పుడు కేసీఆర్ క‌న్ను బీజేపీపై ప‌డిన‌ట్టు తెలుస్తోంది.

తెలంగాణ‌లో బీజేపీ బలం రోజురోజుకు తగ్గిపోతోంది.కేంద్రంలో అధికారంలో ఉన్నా.

రాష్ట్రంలో మాత్రం కమలం వికసించడం లేదు.దానికి రాష్ట్ర నాయకత్వమే ప్రధాన కారణమన్న ఆరోపణలున్నాయి.

ఈ క్ర‌మంలోనే అక్క‌డ బీజేపీకి కాస్తో కూస్తో ఉన్న క్యాడ‌ర్ టీఆర్ఎస్ వైపు చూస్తోంది.బీజేపీకి ఉన్న ఐదుగురు ఎమ్మెల్యేల్లో ఓ ఎమ్మెల్యే సైతం టీఆర్ఎస్‌లోకి వెళ్లాలా ? వ‌ద్దా ? అన్న మీమాంస‌లో ఉన్న‌ట్టు తెలుస్తోంది.

గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లోని ఉప్ప‌ల్ బీజేపీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్ర‌భాక‌ర్ బీజేపీలో కిందిస్థాయి నుంచి ఎమ్మెల్యే వ‌ర‌కు ఎదిగారు.మీడియాలో పార్టీ వాయిస్ వినిపించ‌డంలో ఆయ‌న ముందుంటారు.అయినా బీజేపీ మాత్రం ఆయ‌న‌కు అస్స‌లు ప్ర‌యారిటీ ఇవ్వ‌డం లేద‌న్న టాక్ ఉంది.కేంద్ర‌మంత్రి ద‌త్తాత్రేయ‌తో పాటు కిష‌న్‌రెడ్డి, ల‌క్ష్మ‌ణ్ త‌ప్ప ప్ర‌భాక‌ర్ లాంటి వ్య‌క్తుల‌ను రాష్ట్ర‌, కేంద్ర పార్టీ పెద్ద‌లు ప‌ట్టించుకోవ‌డం లేద‌న్న టాక్ ఎప్ప‌టి నుంచో ఉంది.

ఈ క్ర‌మంలోనే తీవ్ర అసంతృప్తితో ఉన్న ప్ర‌భాక‌ర్‌ను టీఆర్ఎస్ నాయ‌కులు త‌మ పార్టీలోకి రావాల‌ని ఆహ్వానించార‌ట‌.సీఎం కేసీఆర్ సైతం నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధితో పాటు ఫ్యూచ‌ర్ తాను చూసుకుంటాన‌ని ప్ర‌భాక‌ర్‌కు క‌బురు పంపార‌ట‌.

ఇన్న‌ర్ టాక్ ప్ర‌కారం జూన్ త‌ర్వాత ప్ర‌భాక‌ర్ బీజేపీకి షాక్ ఇచ్చి టీఆర్ఎస్‌లోకి జంప్ చేస్తార‌ని టాక్‌.

తెలంగాణ‌లో బీజేపీ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల్లో ప్ర‌భాక‌ర్ కూడా పార్టీ మారిపోతే ఇక ఆ పార్టీకి న‌లుగురు ఎమ్మెల్యేలే ఉంటారు.

అయితే మోడీతో సన్నిహితంగా ఉండే కేసీఆర్.బీజేపీ ఎమ్మెల్యేను టీఆర్ఎస్‌లో చేర్చుకుంటే ప‌రిణామాలు ఎలా ఉంటాయో ? చూడాలి.అదే జ‌రిగితే ఫ్యూచ‌ర్‌లో ఈ రెండు పార్టీల పొత్తు ఎంత వ‌ర‌కు ఉంటుంద‌న్న‌ది కూడా ప్ర‌శ్నార్థ‌క‌మే.?

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube