దేశద్రోహి అనుష్క శర్మ అంటున్న బీజేపీ ఎమ్మెల్యే

బాలీవుడ్ సినిమాలలో అప్పుడప్పుడు కొన్ని సన్నివేశాలు ఎవరో ఒకరి మనోభాలని కించపరిచే విధంగా ఉంటాయి.వాయిపై సదరు సంఘాలు కూడా కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం తరుచుగా జరుగుతుంది.

 Bjp Mla Files Fir Against Anushka Sharma, Bollywood, Uttar Pradesh, Patal Lok, V-TeluguStop.com

అలాగే సినిమా కథలపై ఒక్కోసారి అభ్యంతరాలు వ్యక్తం అవుతూ ఉంటాయి.ఏది ఏమైనా బాలీవుడ్ సెలబ్రిటీలకి, రాజకీయ నాయకులకి ఎప్పుడు ఏదో ఒక విషయంపై వైరం నడుస్తుంది.

ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ తీసిన వెబ్ సిరీస్ వివాదాస్పదంగా మారింది.ఇందులో కొన్ని సన్నివేశాలని గూర్ఖాలని అవమానించే విధంగా ఉన్నాయి అంటూ ఆ వర్గం వారు ఇప్పటికే కేసు పెట్టారు.

తాజాగా యూపీకి చెందిన బీజేపీ ఎమ్మెల్యే అనుష్క శర్మని ఏకంగా దేశ ద్రోహి అనేసాడు.

దేశ ద్రోహి అయిన అనుష్క శర్మకు దేశభక్తుడైన విరాట్ కోహ్లీ విడాకులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

బీజేపీ ఎమ్మెల్యే నందకిశోర్ గుర్జర్ ఫోటోలని అనుష్క శర్మ నిర్మించిన వెబ్ సిరీస్ పాతాళ్‌లోక్ లో అనుమతి లేకుండా ఉపయోగించుకున్నారు.దీనిపై అతను కేసు కూడా పెట్టాడు.

అక్కడితో ఆగకుండా ఆ వెబ్‌సిరీస్‌ను నిషేధించాలంటూ కేంద్ర సమాచార ప్రసార మంత్రి ప్రకాశ్ జవదేకర్‌కు లేఖ రాశారు.మత విద్వేషాలు రెచ్చగొడుతున్న అనుష్కపై జాతీయ భద్రతా చట్టం కింద కేసు నమోదు చేయాలని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

అనుష్క దేశద్రోహి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.దేశం తరపున ఆడుతున్న విరాట్ కోహ్లీకి ఎంతో దేశభక్తి ఉందని, దేశద్రోహి అయిన అనుష్కకు విడాకులు ఇవ్వాలని కోరారు.

మరి ఈ వ్యవహారంపై అనుష్క శర్మ ఎలా స్పందిస్తుందో అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube