ఆ ఎమ్మెల్యే జ‌న‌సేన‌లోకి జంపేనా..!     2018-05-27   22:39:57  IST  Bhanu C

తూర్పుగోదావ‌రి జిల్లా రాజ‌మండ్రి న‌గ‌ర ఎమ్మెల్యే, బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడు ఆకుల స‌త్య‌నారాయ‌ణ రాజ‌కీయ వ్యూహం యూట‌ర్న్ తీసుకుంటోందా? బీజేపీలో సీనియ‌ర్ అయిన ఆయ‌న‌కు ప్ర‌త్యేకంగా ఎలాంటి గుర్తింపూ లేక‌పోవ‌డం, వ‌స్తుంద‌ని అనుకున్న ప‌ద‌వి.. రాకుండా పోవ‌డం.. రాష్ట్రంలో పార్టీ బ‌తికి బ‌ట్ట‌క‌డుతుంద‌న్న ధీమా లేక‌పోవ‌డం వంటి ప‌రిణామాల నేప‌థ్యంలో ఆకుల వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగూ బీజేపీ ఏపీలో బ‌తికి బ‌ట్ట‌క ట్ట‌డం అనేది అంత ఈజీకాద‌నే విష‌యం అంద‌రికీ తెల‌సిందే. ముఖ్యంగా సోము వీర్రాజు వంటి కీల‌క నేత‌ను ప‌క్క‌న పెట్టి.. కాంగ్రెస్ నుంచి వ‌చ్చిన క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌ను రాష్ట్ర అధ్య‌క్షుడిగా చేయ‌డంప‌నై ఆకుల స‌ల‌స‌లా మ‌సిలి పోతున్నారు.

పైకి మాత్రం కూల్‌గా ఉన్న‌ప్ప‌టికీ.. ఆయ‌న మాత్రం లోలోన ర‌గిలిపోతున్నార‌ని బీజేపీ సీనియ‌ర్లు చెబుతున్న మాట‌. ఈ క్ర‌మంలోనే రానున్న రోజుల్లో కొందరు బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు సైతం పార్టీ మారుతారని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ వార్తలకు బలం చేకూర్చే విధంగా.. ఒక ఆసక్తికర అంశం చోటుచేసుకుంది. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనా రాయణ భార్య ఆకుల లక్ష్మీపద్మావతి.. పవన్ కళ్యాణ్ కి సంపూర్ణ మద్దతు పలికారు. ఉద్దానం బాధితుల కోసం పవన్ చేసిన దీక్షకు సంఘీభావంగా ఆమె కూడా ఒకరోజు దీక్ష చేశారు.