వెంక‌య్య విష‌యంలో బీజేపీ పొర‌బ‌డిందా?!

ఏపీ, తెలంగాణ‌లో బీజేపీకి కీల‌కంగా ఉన్న సీనియ‌ర్ నాయ‌కుడు, గ‌తంలో బీజేపీని దేశ వ్యాప్తంగా న‌డిపించిన నేత ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.2014 ఎన్నిక‌ల్లో బీజేపీకి సాధ్య‌మైన‌న్ని ఎక్కువ స్థానాలు ల‌భించేలా ఆయ‌న చేసిన కృషి అంతా ఇంతా కాదు.ఇక‌, 2019పై ఆయ‌న అనేక ఆశ‌లు పెట్టుకున్నారు.కేంద్రంలో మోదీని మ‌రోసారి పీఎంను చేయ‌డం, ఏపీ, తెలంగాణ‌లో బీజేపీని బ‌లోపేతం చేయడం ఆయ‌న క‌ళ్ల ముందున్న ల‌క్ష్యాలు.

 Bjp Mistake On Venkaiah Naidu-TeluguStop.com

అయితే, అనూహ్యంగా అనుకున్న‌దొక్క‌టి.జ‌రిగింది ఒక్క‌టి.

అన్న‌ట్టుగా వెంక‌య్య పూర్తిగా రాజ‌కీయాల‌కు దూరం అయ్యారు.దాదాపు ఐదేళ్ల‌పాటుఆయ‌న క్రియాశీల రాజ‌కీయాల గురించి మాట్లాడ‌డం కానీ, రాజ‌కీయాలు చేయ‌డం కానీ కుద‌ర‌దు.

అలాంటి ప‌రిస్థితి ఎందుకొచ్చింది? వెంక‌య్య ఉప రాష్ట్ర‌ప‌తిగా వెళ్ల‌డం వెనుక ఎవ‌రున్నారు? ఎందుకు ఇలా చేశారు? వ‌ంటి ప్ర‌శ్న‌ల వెనుక అనేక కార‌ణాలు క‌నిపిస్తున్నాయి.

ముఖ్యంగా వెంక‌య్య ఆధ్వ‌ర్యంలో వెంక‌య్య చేతుల మీదుగా ఎదిగిన నేత‌లే ఆయ‌న ఇప్ప‌డు పొలిటిక‌ల్‌గా ఎర్త్ పెట్టార‌ని టాక్ వినిపిస్తోంది.

వెంక‌య్య ఉంటే ఏపీతెలంగాణ‌ల్లో బీజేపీ నిష్క‌ర్ష‌గా ఎద‌గ‌లేద‌ని, ఆయ‌న‌ను క్రియాశీల రాజ‌కీయాల‌నుంచి త‌ప్పిస్తేనే ఈ రెండు రాష్ట్రాల్లోని నేత‌ల‌కు స్వేచ్ఛ ల‌భిస్తుంద‌ని రామ్ మాధ‌వ్ వంటి యువ నేత‌లు బీజేపీ అధిష్టానం వ‌ద్ద వినిపించారు.వాస్త‌వానికి ఎలాగైనా ఏపీలో ఎద‌గాల‌ని, తెలంగాణ‌లో అయితే అధికారం దిశ‌గా పావులు క‌ద‌పాల‌ని భావిస్తున్న బీజేపీకి రామ్ మాధ‌వ్ చెప్పిన విష‌యం అమృతంగా తోచింది.

మ‌రో ఆలోచ‌న రాకుండా/ లేకుండా వెంక‌య్య‌ను ఉప రాష్ట్ర‌ప‌తిగా ఎంపిక చేసేశారు.

అయితే, త‌న‌కు ఈ ప‌ద‌వి ఇష్టం లేద‌ని, త‌న జీవిత చ‌ర‌మాంకం వ‌ర‌కు ప్ర‌జ‌ల్లోనే ఉండాల‌ని ఉంద‌ని వెంక‌య్య మ‌నసులో మాట చెప్పుకొచ్చారు.

అయినా కూడా అధిష్టానంలోని మోడీ, షాలు స‌సేమిరా అన్నారు.ఇక‌, త‌ప్ప‌ద‌ని గ్ర‌హించిన వెంక‌య్య .త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితిలో ఉప‌రాష్ట్ర‌ప‌తిగా నామినేష‌న్ వేశారు.ఇక‌, ఇప్పుడు ఏపీ, తెలంగాణలలోని బీజేపీ విష‌యానికి వ‌ద్దాం.

ఎవ‌రో చెబితే బీజేపీ అధిష్టానం న‌మ్మిన‌ట్టుగా.ఏపీలో, తెలంగాణ‌లో పార్టీ ఎదుగుద‌ల‌కు వెంక‌య్యే అడ్డ‌మా? 2014లో ఆయ‌న వ్యూహం వ‌ల్లే బీజేపీ ఆశ‌లు గ‌ల్లంత‌య్యాయా? అని ఆలోచిస్తే.ఇదంతా ఫ‌క్తు త‌ప్పుడు ఆరోప‌ణేన‌నేది స్ప‌ష్టం.

గ‌తం నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు బీజేపీ ప‌రిస్థితి ద‌క్షిణాదిలో ఒకే విధంగా ఉంది.ప్రాంతీయ వాదానికి, స్థానిక నేత‌ల‌కు బ‌ల‌మైన రాష్ట్రాలు ద‌క్షిణాదివి.అలాంటి చోట‌.

వెంక‌య్య వంటి బ‌ల‌మైన సామాజిక నేప‌థ్యం, ప‌లుకుబ‌డి ఉన్న నేత వ‌ల్ల‌బీజేపీకి అన్ని విధాలా మేలే జ‌రుగుతుంది.కానీ, ఇప్పుడు ఆయ‌న‌ను వ‌దులుకోవ‌డం ద్వారా మ‌ళ్లీ అలాంటి నేత‌ను బీజేపీ త‌యారు చేసుకోవ‌డం అంత వీజీ కాదు.

మ‌రి అధిష్టానం తీసుకున్న నిర్ణ‌యం ఖ‌చ్చింత‌గా వ్యూహాత్మ‌క త‌ప్పిదం అనడంలో ఎలాంటి సందేహం లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube