హుజురాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ మైండ్ గేమ్... అసలు వ్యూహం ఇదేనా?

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో హుజూరాబాద్ ఉప ఎన్నిక ఎంత పెద్దగా హాట్ టాపిక్ గా మారిందో మనకు విదితమే.అయితే ఈ ఉప ఎన్నిక పోలింగ్ కు గడువు మరికొన్ని రోజుల్లో ముగియనుంది.

 Bjp Mind Game In Huzurabad By-election ... Is This The Real Strategy , Ts Potics-TeluguStop.com

కావున ప్రధాన పార్టీలైన బీజేపీ పార్టీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ లు తమ ప్రచారాన్ని ఉధృతం చేశాయి.ఇక బీజేపీ ఈ ఎన్నికలో ఎలాగైనా గెలవాలనే ఉద్దేశ్యంతో గెలవడానికి ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవడం లేదు.

దుబ్బాక ఉప ఎన్నికలో గెలిచి ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన బీజేపీ ఈ ఉప ఎన్నికలో కూడా గెలిచి టీఆర్ఎస్ పార్టీ కి ప్రత్యామ్నాయం బీజేపీ అని ప్రజలకు సంకేతాలివ్వాలని బీజేపీ కృత నిశ్చయంతో ఉంది.అయితే ఈ ఉప ఎన్నికలో గెలుపు కోసం బీజేపీ రకరకాల వ్యూహాలను పన్నుతోంది.

అందులో భాగంగా మైండ్ గేమ్ ను మొదలు పెట్టింది బీజేపీ.బీజేపీ గెలుపూ ఖాయమైందని, ఇక ప్రస్తుతం బీజేపీ చేసే ప్రచారం మెజారిటీ కోసమేనని, ప్రజలంతా ఒక్కటై ఈటెల గెలిపించేందుకు ఆసక్తిగా ఉన్నారని బీజేపీ తమ ప్రచార సభల్లో పెద్ద ఎత్తున చెబుతున్న పరిస్థితి ఉంది.

దీంతో మెజారిటీ ప్రజలు ఈటెల గెలవనున్నాడనే ఆలోచనతో ఇతర పార్టీలకు ఓటు వేసేందుకు ఆలోచిస్తారనేది బీజేపీ నేతల మైండ్ గేమ్ ప్లాన్.ప్రస్తుతం కాంగ్రెస్ ను మినహాయిస్తే టీ ఆర్ఎస్, బీజేపీకి పెద్ద ఎత్తున పోటాపోటీ వాతావరణం నెలకొన్న పరిస్థితి ఉంది.

తమ ప్రాబల్యాన్ని కొనసాగించాలనే పట్టుదలతో టీఆర్ఎస్, టీఆర్ఎస్ పార్టీ కంచుకోటను బద్దలు కొట్టాలనే కృత నిశ్చయంతో బీజేపీ ఉన్న పరిస్థితి ఉంది.ఏది ఏమైనా బీజేపీ మైండ్ గేమ్ ఆడుతూ సరికొత్త రాజకీయ వ్యూహాలకు తెరలేపుతూ మిగతా పార్టీలకు ఝలక్ ఇస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube