హుజురాబాద్ లో మొదలైన బీజేపీ మార్క్ రాజకీయం

దేశంలో ఉన్న ప్రస్తుతం ఉన్న ప్రధాన బలమైన రాజకీయ పార్టీలలో బీజేపీ ఒకటన్న విషయం మనం ప్రత్యేకంగా చర్చించుకోనక్కరలేదు.ఒక్కో పార్టీకి ఒక్కో రాజకీయ విధానం ఉంటుంది.

 Bjp Mark Politics That Started In Huzurabad/trs Party, Huzurabad By Elctions, B-TeluguStop.com

కానీ బీజేపీ రాజకీయ విధానం ఎవరికి అంతుపట్టదు.తమ రాజకీయ సౌలభ్యం కోసం ఎటువంటి అడుగు ముందువేయడానికైనా వెనుకాడని పరిస్థితి ఉంటుందనేది దేశంలో జరిగిన రకరకాల ఎన్నికల్లో బీజేపీ అనుసరించిన విధాన పట్ల దేశ వ్యాప్తంగా నెలకొన్న ప్రచారం ఇది.ప్రజలలో సెంటిమెంట్ రెచ్చగొట్టి ఎన్నికలలో విజయం సాధించాలనేది బీజేపీ ఎప్పుడూ అనుసరించే వ్యూహం.అయితే ఈ వ్యూహం చాలా చోట్ల విజయవంతం కావడంతో ఎక్కడ ఏ ఎన్నికలో బీజేపీ పోటీ చేసినా క్షేత్ర స్థాయి ప్రచార సభల్లో ఏదో ఒక సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగించి సానుభూతి ఓటు బ్యాంకును ఏర్పాటు చేసుకుంటారు.
 

దీంతో ఎంతో కొంత ప్రత్యర్థి ఓటు బ్యాంకుపై ప్రభావం పడేందుకు ఎక్కువ అవకాశం ఉంది.దీంతో హుజూరాబాద్ ఎన్నిక బీజేపీకి ప్రతిష్టాత్మక ఎన్నిక కావడంతో గెలిచేందుకు ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకుంటోంది.

తాజాగా ఈటెల రాజేందర్, బండి సంజయ్ పాల్గొన్న ఎన్నికల సభలలో ఈటెల రాజేందర్ కంటతడి పెట్టడం దీంతో బండి సంజయ్ ఈటెలను గెలిపించి సంతోషపెడతారా లేకా బాధపెడతారా అన్నది మీ చేతుల్లోనే ఉంది అంటూ మరొక్క సారి బీజేపీ మార్క్ సెంటిమెంట్ రాజకీయానికి తెరలేపారు.

Telugu Bandi Sanjay, Bjp, Etala Rajendher, Harish Rao, Huzurabad, Trs, Ts Poltic

ఇక దీంతో బీజేపీ మార్క్ రాజకీయాన్ని పూర్తి స్థాయిలో ఇక రానున్న రోజుల్లో ప్రయోగిస్తారని ఈటెల గెలుపొందేందుకు ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించుకుంటూనే, చివరి నిమిషం వరకు టీఆర్ఎస్ పై ప్రజల్లో వ్యతిరేకతను ఈటెలకు ఉన్న విజయావకాశాలను పెంచుకోవాలనేది బీజేపీ ప్రధాన వ్యూహంలా అనిపిస్తోంది.మరి బీజేపీ వ్యూహాలు, బీజేపీ మార్క్ రాజకీయం ఈటెల విజయం సాధించేందుకు ఎంతవరకు దోహదపడతాయనేది చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube