వైసీపీకి బీజేపి దెబ్బెయ్యబోతోందా ? ఆయన రాక వెనుక ? 

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు అనే విషయాన్ని మరోసారి రుజువు చేసేందుకు బీజేపీ సిద్ధమై పోతున్నట్టుగా కనిపిస్తోంది.ఇప్పటి వరకు వివిధ అవసరాల నిమిత్తం ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తూ వస్తున్న ఆ పార్టీ , ఇకపై టిడిపి తో సమానంగా వైసీపీని చూడాలని,  అన్ని విషయాల లోనూ ఆ పార్టీ ని ఇబ్బంది పెట్టి రాజకీయంగా బిజెపి పై చేయి సాధించే విధంగా చేసుకోవాలి అనే ప్లాన్ చేస్తోంది.

 Bjp Maind Game Politics On Ysrcp Issue, Krishna Dharan, Ysrcp, Ys Jagan, Tdp, Ap-TeluguStop.com

దీనికి తగ్గట్టుగానే ఏపీ బిజెపి లో అనూహ్య మార్పులు చేసేందుకు ఆ పార్టీ సిద్ధమవుతున్నట్లుగా కనిపిస్తోంది.కొద్ది రోజుల క్రితం దుబ్బాక లో జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బిజెపికి విజయం దక్కడం తో ఆ పార్టీ వైఖరిలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది.

 వైసిపికి అనుకూలంగా ప్రతి విషయంలోనూ వ్యవహరిస్తూ,  ఆ పార్టీకి మేలు జరిగే విధంగా చేసుకుంటే, గతంలో టిడిపి బిజెపి పొత్తు ఉన్న సమయంలో పరిస్థితి ఏవిధంగా ఉందో ఇప్పుడు అదే రకమైన ఇబ్బందులు తలెత్తుతాయనే ఆలోచనలో ఆ పార్టీ ఉన్నట్లుగా కనిపిస్తోంది.తాజాగా బిజెపి అన్ని రాష్ట్రాలకు కొత్త ఇన్చార్జిల నియామకం చేపట్టింది.

అదే విధంగా ఏపీ బీజేపీ కి కొత్త ఇన్చార్జి వచ్చారు.దీంతో బిజెపి వైసిపి విషయంలో రానున్న రోజుల్లో ఎటువంటి వైఖరి ఉంది అనే విషయం స్పష్టం అవుతోంది.

ఎందుకంటే ఏపీ బీజేపీ ఇన్చార్జిగా వచ్చిన మురళీధరన్ కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నారు.అక్కడ హిందూ వాదాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్లడం,  వామపక్ష పార్టీ లు బలంగా ఉన్న ఆ రాష్ట్రంలో బిజెపికి క్రెడిట్ పెరిగే విధంగా చేయగలగడం లోనూ, ఆయన సక్సెస్ అవుతూ వస్తున్నారు.

ఎర్ర పార్టీలకు బలంగా ప్రజాధరణ ఉన్న అక్కడ, బీజేపీ పట్టు ఇప్పుడిప్పుడే పెరుగుతూ వస్తోంది.ఆ మధ్య కాలంలో శబరిమల వ్యవహారంలో జరిగిన ఆందోళనలో గొడవలు వెనుక మురళీధరన్ ఉన్నారు అనేది స్పష్టంగా కనిపిస్తోంది.

ఇక అప్పటి నుంచి బీజేపీకి కేరళలో మద్దతు పెరుగుతోంది.

Telugu Incharge, Jagan, Muralidharan, Ysrcp-Political

ఇక ఇప్పుడు ఆయన ఏపీ ఇన్చార్జిగా రాబోతుండడం వెనుక కారణాల పరిశీలిస్తే,  ఏపీలో క్రిస్టియానిటీ పెరిగేందుకు వైసీపీ ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తుందనే ఆరోపణలు ఎదుర్కొంటోంది.ఈ నేపథ్యంలోనే మురళీధరన్ ద్వారా వైసీపీ ప్రభుత్వం ను ఇరుకున పెట్టే విధంగా బిజెపి ప్లాన్ చేసుకుంటోంది అనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.ఇక వైసీపీ కూడా ఈ విషయంలో జాగ్రత్త పడుతున్నట్లు వ్యవహరిస్తోంది.

ఏది ఏమైనా ఇక్కడ వైసిపి,  బీజేపీలు తెరవెనుక పొత్తు ముందు ముందు కొనసాగే అవకాశం కనిపించడం లేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube