బళ్లారి లో బీజేపీకి ఎదురు'గాలి' ఆ సీటులో ఓటమి   BJP Lost In Karnataka Elections Polls     2018-11-06   15:27:35  IST  Sai M

దేశవ్యాప్తంగా బీజేపీ జోరు పెంచాలని చూస్తుంటే… దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం ఆ పార్టీకి ఇంకా ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. మొన్నటికి మొన్న కాంగ్రెస్ కంటే… మెరుగైన ఫలితాలు సాధించిన ఆ పార్టీ అధికారం మాత్రం దక్కించుకోలేక పోయింది. అయితే… ప్రస్తుతం అక్కడ జరిగిన ఉపఎన్నికల ఫలితాల్లో కూడా… బీజేపీకి గట్టి షాక్ తగిలింది. బళ్లారి లోక్‌సభ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థి ఉగ్రప్ప ఘన విజయం సాధించారు. తన సమీప భాజపా అభ్యర్థి శాంతపై భారీ మెజార్టీతో ఆయన గెలిచారు.

అసలు బళ్లారి పేరు చెప్తేనే… గుర్తుకు వచ్చేది గాలి జనార్దన్ రెడ్డి. ఇక్కడ గాలి బ్రదర్స్ కు మంచి పట్టు ఉంది. 2014 లోక్‌సభ ఎన్నికల్లోనూ భాజపా నేత బి. శ్రీరాములు బళ్లారిలో విజయం సాధించారు. అయితే ఈ ఏడాది కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన శ్రీరాములు తన లోక్‌సభ స్థానానికి రాజీనామా చేశారు. దీంతో ఇక్కడ ఎన్నిక వచ్చింది.